
ది కాశ్మీర్ ఫైల్స్ మూవీతో ఇండియా వైడ్ వివేక్ అగ్నిహోత్రి పేరు వినిపించింది. ది కాశ్మీర్ ఫైల్స్ మోస్ట్ కాంట్రవర్సియల్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఓ వర్గం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ది కాశ్మీర్ ఫైల్స్ ప్రదర్శించారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా జ్యూరీ హెడ్ నవద్ లాపిడ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి చిత్రాన్ని ప్రదర్శించడం తగదన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ ప్రాపగాండా చిత్రమని అభిప్రాయపడ్డారు.
వివేక్ మాత్రం ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని సమర్ధించుకున్నారు. ముస్లిమ్స్ కారణంగా వేధింపులకు గురైన కాశ్మీర్ పండిట్స్ ని కలిసి ఐదేళ్లు శ్రమించి ప్రిపేర్ చేసిన స్క్రిప్ట్ అన్నారు. ది కాశ్మీర్ ఫైల్స్ వివాదం అనంతరం వివేక్ అగ్నిహోత్రి పలు సందర్భాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఆదిపురుష్ చిత్రంతో పాటు హీరో ప్రభాస్ టార్గెట్ గా సీరియస్ కామెంట్స్ చేశారు.
ముఖ్యంగా ప్రభాస్ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా అనుచిత కామెంట్స్ చేశారు. రాత్రంతా తాగి పొద్దున్నే దేవుడిని అంటే ఎవరూ నమ్మరు. జనాలు పిచ్చోళ్ళు కాదు అందరినీ దేవుడిగా అంగీకరించరు అన్నారు. రాధే శ్యామ్ చిత్రాన్ని తన కాశ్మీర్ ఫైల్స్ దెబ్బతీసిందని, సలార్ చిత్రాన్ని నెక్స్ట్ మూవీ వ్యాక్సిన్ వార్ తో దెబ్బ తీస్తానని వివేక్ అగ్నిహోత్రి సన్నిహితులతో అన్నారని సమాచారం. ఈ వార్తలను వివేక్ అగ్నిహోత్రి ఖండించారు.
తాజాగా మరో స్టార్ హీరో మీద వివేక్ అగ్నిహోత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. రణ్వీర్ సింగ్ ఓ అవార్డు కార్యక్రమంలో అందరి ముందు నా కాళ్ళు పట్టుకున్నాడని చెప్పాడు. రణ్వీర్ సింగ్ చేసిన న్యూడ్ ఫోటో షూట్ పై విమర్శలు వెల్లువెత్తగా నేను మాత్రం సమర్ధించాను. అందుకు కృతజ్ఞతగా రణ్వీర్ సింగ్ నా పాదాలు తాకాడని వివేక్ అగ్నిహోత్రి చెప్పడం సంచలనంగా మారింది. ఇంకా మాట్లాడుతూ నేను యంగ్ ఫిల్మ్ మేకర్స్ ని ప్రోత్సహించాను. యూత్ ధైర్య సాహసాలతో ఉండాలని, వివేక్ అన్నారు.
కొన్నాళ్ల క్రితం రణ్వీర్ సింగ్ నగ్నంగా ఫోటో షూట్ చేశారు. దీన్ని సాంప్రదాయవాదులు వ్యతిరేకించారు. ఆయన మీద నిరసనలు వెల్లువెత్తాయి. రణ్వీర్ కి బట్టలు దానం చేయండని ఒక క్యాంపైన్ కూడా చేశారు. పలు చోట్ల ఆయన మీద కేసులు పెట్టారు.