ప్రభాస్ 'కల్కి 2898 AD'లో దుల్కర్, హింట్ ఇదేనా?

Published : Aug 15, 2023, 08:17 AM IST
ప్రభాస్ 'కల్కి 2898 AD'లో దుల్కర్, హింట్ ఇదేనా?

సారాంశం

మైథలాజికల్ బ్యాక్డ్రాప్ లో సైఫై థ్రిల్లర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్,కమల్ తో పాటుగా మరికొంత మంది స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని వార్తలొస్తున్న నేపథ్యంలో ...


 ప్రాజెక్ట్ K గా పిలువబడుతున్న.. ప్రభాస్(Prabhas) 'కల్కి 2898 AD'  ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ప్రపంచం మొత్తం దృష్టి ఈ సినిమాపై పడింది. ఈ సినిమా గురించి చర్చలు దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో మొదలయ్యాయి.  అభిమానులు ఈ మూవీ పై భారీ ఆశలు పెట్టుకున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అలాగే రీసెంట్ గా జూలై 20న అమెరికాలోని ప్రఖ్యాత శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్ లో మూవీ టైటిల్..ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయగా అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.  ఇక  ఈ మూవీలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని,  కమల్ హాసన్,  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు మరో వార్త మీడియాలో హల్ చల్ చేస్తోంది. అదేమిటంటే..ఈ సినిమాలో దుల్కర్ కూడా నటిస్తున్నాడని. అయితే ఇప్పటిదాకా అఫీషియల్ గా ఈ విషయమై టీమ్ నుంచి క్లారిటీ లేదు. మరి ఇలా క్లారిటీగా ఈ విషయాన్ని చెప్పగలం అంటే...

దుల్క‌ర్  తాజా చిత్రం `కింగ్ ఆఫ్ కోత‌` ఈనెల‌లోనే విడుద‌ల కాబోతోంది. ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా దుల్క‌ర్ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా `ప్రాజెక్ట్ కె` ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. మీడియావారు ...ప్రాజెక్ట్ కెలో మీరు ఉన్నారా? అని అడిగితే, ఈ ప్ర‌శ్న‌కు దుల్క‌ర్ డైరక్ట్ గా  స‌మాధానం చెప్ప‌లేదు. “ఈ విష‌యం గురించి నేను మాట్లాడ‌కూడ‌దు. చిత్ర‌ టీమే చెప్పాలి. కల్కి సినిమా అద్భుతంగా ఉండబోతుందని, నాగ్ అశ్విన్ కి తప్ప మరెవరికి అలాంటి ఆలోచన రాదనీ అన్నాడు. కల్కి సినిమా కథ గురించి ఇంతగా చెప్పాడంటే సినిమాలో కచ్చితంగా దుల్కర్ కీలక పాత్రలో నటించనున్నాడని, ఇదే హింట్ అని  కామెంట్ చేస్తున్నారు.  

మరో ప్రక్క ఈ మూవీ రిలీజ్ వాయిదా పడిందని తెలుస్తోంది.  మొదట 2024 జనవరి 12న మేకర్స్ రిలీజ్ డేట్ ప్రకటించగా..ఇప్పుడు మే 9, 2024కి షిఫ్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి.  ఈ మూవీ ప్రొడ్యూసర్ అశ్వినీదత్(Aswani Dutt)  కు మే 9వ తేదీ అంటే.. చాలా సెంటిమెంట్ కలిగి ఉన్నారని..గతంలో ఆయన వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) బ్యానర్ నుంచి వచ్చిన చిత్రాలు 'జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి భారీ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాయి. కలెక్షన్ల పరంగానే కాకుండా జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా తెచ్చిపెట్టాయి. ఈ రెండు చిత్రాలు మే 9న విడుదల అవ్వటమే ఇందుకు కారణమని.. కనుకే   ప్రభాస్ కల్కి 2898 AD మూవీను సైతం మే 9, 2024న రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. 

అలాగే  రిలీజ్ వాయిదా విషయంలో.. మరో కారణం కూడా వినిపిస్తోంది.  ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ VFX నాణ్యత కోసం సోషల్ మీడియాలో భారీగా ట్రోల్ చేయబడిన విషయం తెలిసేందే. అందుకుగాను ఈ మూవీ టీం..ప్రేక్షకులకు సాధ్యమైనంత VFX విజువల్ ను   అందించడానికి మేకర్స్ మరింత సమయం తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా
Suriya: కంగువతో విమర్శలు, హ్యాట్రిక్ హిట్లు కొట్టేందుకు ప్లాన్.. సూర్య చేస్తున్న 3 సినిమాలు ఇవే