Vishwak Sen:గోదారి అల్లుడు అదరకొట్టాడు, ఫుల్ ఫన్ (టీజర్)

Surya Prakash   | Asianet News
Published : Feb 02, 2022, 01:45 PM IST
Vishwak Sen:గోదారి అల్లుడు అదరకొట్టాడు, ఫుల్ ఫన్ (టీజర్)

సారాంశం

 'ఇంటర్​క్యాస్ట్​ అరేంజ్​డ్​ మ్యారెజ్ సినిమాల్లో అయినా అయితదారా.. ఇదే ఫస్టా' అంటూ ప్రారంభమైన సినిమా టీజర్​ ఇంట్రస్టింగ్ గా  ఉంది. సంబాషణలు, సీన్లు, పెళ్లి కోసం విశ్వక్ సేన్​ చేసే ప్రయత్నాలు  బాగున్నాయి.


'వెళ్లిపోమాకే' సినిమాతో లవర్ బాయ్‌గా పరిచయమైన విశ్వక్‌ సేన్‌ తర్వాత మాస్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నగరానికి ఏమైంది, ఫలక్‌నూమా దాస్, హిట్, పాగల్‌ వంటి విభిన్న చిత్రాల్లో నటించి మెప్పు పొందాడు. తాజాగా విశ్వక్‌  మరో కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను డిఫెరెంట్ గా చేస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం టీజర్ ని విడుదల చేసారు. ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 'ఇంటర్​క్యాస్ట్​ అరేంజ్​డ్​ మ్యారెజ్ సినిమాల్లో అయినా అయితదారా.. ఇదే ఫస్టా' అంటూ ప్రారంభమైన సినిమా టీజర్​ ఇంట్రస్టింగ్ గా  ఉంది. సంబాషణలు, సీన్లు, పెళ్లి కోసం విశ్వక్ సేన్​ చేసే ప్రయత్నాలు  బాగున్నాయి. ఈ సినిమాతో సరైనా సమయంలో పెళ్లి చేసుకోకుంటే ఎలాంటి సమస్యలు తలెత్తుతాయో హ్యూమరస్​గా చూపించారు. టీజర్ చివరిలో విశ్వక్​ సేన్​ చెప్పే డైలాగ్​ ఆకట్టుకునేలా ఉంది. మార్చి 4న ప్రేక్షకులముందుకు రానుందీ సినిమా.

నిర్మాత‌లు బాపినీడు.బి, సుధీర్ మాట్లాడుతూ ‘‘‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ అనే టైటిల్ ఎంత డిఫ‌రెంట్‌గా ఉందో, సినిమా కూడా అలాగే ఉంటుంది. ల‌వ్‌, ఫ‌న్ స‌హా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. ఇప్ప‌టి వ‌ర‌కు విష్వ‌క్ సేన్ న‌టించిన, న‌టిస్తోన్న చిత్రాల‌కు ఇది పూర్తి భిన్న‌మైన చిత్రం. విష్వ‌క్ లుక్ కూడా కొత్త‌గా ఉంటుంది.ఈ చిత్రానికి ర‌వికిర‌ణ్ రైట‌ర్‌. విద్యాసాగ‌ర్ చింత ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ స‌హా ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఎవ‌ర‌నే విష‌యాన్ని త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

న‌టీన‌టులు:
విష్వ‌క్ సేన్‌

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌: ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌
స‌మ‌ర్ప‌ణ‌: బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్‌
నిర్మాత‌లు: బాపినీడు.బి, సుధీర్‌
ద‌ర్శ‌క‌త్వం: విద్యాసాగ‌ర్ చింత‌
రైట‌ర్: ర‌వికిర‌ణ్‌

 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు