
ఎట్టకేలకు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ (Ajith) ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ వినిపించారు వాలిమై(Valimai) మేకర్స్. కరోనా కారణంగా రెండు సార్లు వాయిదా పడ్డ ఈమూవీకి కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు.
కోలీవుడ్ లో అజిత్(Ajith) వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. అజిత్ సినిమా అంటే పిచ్చి క్రేజ్ ఉంటుంది తమిళంలో. ఇక అజిత్ హీరోగా వినోద్ డైరెక్షన్ లో.. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోణీ కపూర్(Boni Kapoor) నిర్మించిన సినిమా వాలిమై. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కావల్సి ఉంది కాని కరోనా కారణంగా సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు టీమ్. రాను రాను పరిస్థితులు మారుతూ వస్తుండటంతో.. వాలిమై రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు టీమ్.
తెలుగులో బలం టైటిల్ తో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకున్నారు. కాని ఎందుకో ఆ టైటిల్ సెట్ అవ్వదు అనుకున్నారో ఏమో.. ఆలోచన మార్చుకుని వాలిమై(Valimai) పేరుతోనే పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇది ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఈ షాక్ లో ఉండగానే వాలిమై రిలీజ్ ను పోస్ట్ పోన్ చేశారు టీమ్. ఇప్పుడు ఈ సినిమాకు కొత్త డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.
ఇక ఈసినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు టీమ్. వాలిమైను ఫిబ్రవరి 24న ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ఇఫ్పుడిప్పుడే పరిస్థితులపై క్లారిటీ వస్తుంది. ఈనెల మిడ్ వరకూ కరోనా తీవ్రత పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు చెపుతున్నారు. ఇప్పటికే తమిళనాడుతో ఆంక్షలు సడలిస్తూ వస్తున్నారు. థియేటర్స్ లో కూడా 50 పర్సంట్ ఆక్యుపెన్సీని ఎత్తివేసే అవకాశం ఉంది. దాంతో సినిమాలన్నీ రిలీజ్ కు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇక కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith) వాలిమై(Valimai) రిలీజ్ ను కూడా ఈనెలనే రిలీజ్ కాబోతున్నట్టు ప్రకటించారు. తమిళంతో పాటు తెలుగు .. హిందీ భాషల్లోను అదే రోజున ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
ఇక అజిత్ (Ajith) వాలిమై(Valimai) మూవీ కోసం చాలా కష్ట పడ్డాడు. బైక్ రేస్ ల తో స్టంట్స్ చేశాడు. ఈ సినిమాలో అజిత్(Ajith) కు స్ట్రాంగ్ ఆపోజిట్ క్యారెక్టర్ లో టాలివుడ్ యంగ్ హీరో కార్తికేయ నటించారు. టాలీవుడ్ లో హీరోగా వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్న కార్తికేయ.. వాలిమై(Valimai) హిట్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.
భారీ యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో సాగే ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. గిబ్రాన్ ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు.ఇక బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీ కపూర్ నిర్మించిన వాలిమైలో అజిత్ సరసన హీరోయిన్ గా హుమా ఖురేషి నటించింది. ఈ సినిమాలో అజిత్(Ajith) దోపిడీ దొంగల నాయకుడిగా కనిపిస్తాడని సమాచారం.