'సితార' లో విశ్వక్సేన్ నెక్ట్స్ ఖరారు, డైరక్టర్ ఎవరంటే..

By Surya PrakashFirst Published Jan 28, 2023, 2:29 PM IST
Highlights

వరల్డ్‌వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.  

టాలీవుడ్‌లో ఇటీవల విశ్వక్ సేన్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.  యంగ్ హీరో విశ్వక్సేన్ రీసెంట్ గా  వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల క్రితం ఆయన హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ సమయంలో ఒక టీవీ యాంకర్ తో గొడవ పెట్టుకుని ఒక్కసారిగా వివాదాల్లోకి వచ్చిన ఆయన ఇటీవల అర్జున్ డైరెక్షన్లో రూపొందుతున్న సినిమా విషయంలో కూడా ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆ సినిమా నుంచి ముందు విశ్వక్ సేన్ ముందుగా తప్పుకున్నట్టు వార్తలు తెరమీదకు వచ్చాయి. తర్వాత అర్జున్ స్వయంగా రంగంలోకి దిగి అసలు జరిగిన విషయం ఏంటో చెప్పి విశ్వక్సేన్ బాధ్యత రాహిత్యం వల్ల సినిమా ఆపివేస్తున్నానని సినిమా నుంచి ఆయన తొలగిస్తున్నానని పేర్కొన్నారు. ఇక వేరే హీరోతో ఈ సినిమా పూర్తి చేస్తానని ప్రకటించారు.  విమర్శలపాలైన విశ్వక్ సేన్.. ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. కానీ విశ్వక్ సేన్ చేసింది తప్పు అని చాలా మంది టాలీవుడ్ పెద్దలు అభిప్రాయపడ్డారు. 

ఆ తర్వాత దాస్ కా ధంకీ అనే సినిమాలో ప్రస్తుతానికి విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమా ట్రైలర్ ను నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా రిలీజ్ చెయ్యడం ఆ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ పలు కామెంట్లు చేయడం వాటికి విశ్వక్సేన్ రెచ్చిపోవడం ఇలా హాట్ హాట్ గా కొన్ని రోజుల నుంచి విశ్వక్సేన్   వార్తల్లోనే నిలుస్తూ వస్తున్నాడు. ఇప్పుడు విశ్వక్సేన్ కి సంబంధించిన ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. అదేంటంటే విశ్వక్సేన్ మరో సినిమా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఈ సినిమా చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

నితిన్ తో ఛల్ మోహన్ రంగ చిత్రం చేసిన కృష్ణ చైతన్య ఆ తర్వాత ఏ ప్రాజెక్టు చేయలేదు. ఛల్ మోహన్ రంగ చిత్రం కూడా సక్సెస్ కాలేదు. ఆయన తాజాగా ఒక కథ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు వినటం,ఓకే చేసి  సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు.  దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మరో పదిహేను రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. ఇందులో విశ్వక్‌ సేన్‌ విశ్వరూపం చూస్తారని ఆయన చెప్పారు. `బుట్టబొమ్మ` ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ లో ఈ విషయాన్ని వెల్లడించారు. నిజానికి `బుట్టబొమ్మ`లోనే మొదట హీరోగా విశ్వక్‌నే అనుకున్నామ

హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటిస్తున్న ‘దాస్ కా దమ్కీ’ (Das Ka Dhamki) మూవీ రిలీజ్ డేట్‌ని ఆ చిత్ర యూనిట్ ఈరోజు ప్రకటించేసింది. విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలైంది. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్‌కి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) రావడం అక్కడ విశ్వక్ ‌సేన్‌, బాలయ్య మధ్య జరిగిన సంభాషణ మూవీ ప్రమోషన్స్‌కి బాగా ఉపయోగపడింది. ఈ మూవీ‌కి డైరెక్టర్ కూడా విశ్వక్ సేన్ కావడం విశేషం. వరల్డ్‌వైడ్‌గా తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు.  ఈ సినిమాని 2023, ఫిబ్రవరి 17న రిలీజ్ చేయబోతున్నట్లు విశ్వక్ సేన్  ద్వారా ప్రకటించాడు.
 

click me!