భార్యతో హీరో విడాకులు.. సినిమాలే కారణమా..?

Published : May 07, 2019, 01:40 PM IST
భార్యతో హీరో విడాకులు.. సినిమాలే కారణమా..?

సారాంశం

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ 2011లో నటుడు, నిర్మాత కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నారు.

తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ 2011లో నటుడు, నిర్మాత కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నారు. వీరికి ఆర్యన్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. సుమారు ఆరు సంవత్సరాలు కలిసి జీవించిన ఈ జంట అభిప్రాయభేదాల కారణంగా విడిపోయారు. గతేడాది నవంబర్ లో విడాకులు తీసుకున్నారు.

ఈ విషయాన్ని కొన్ని నెలల తరువాత విష్ణు బహిరంగంగా వెల్లడించారు. అయితే ఎందుకు విడిపోవాల్సి వచ్చిందనే కారణాలు మాత్రం చెప్పలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో  పాల్గొన్న ఈ హీరో తన విడాకులకు గల కారణాలను తెలియజేశాడు. 

ఆయన మాట్లాడుతూ.. ''మొదటి నుండి నేను ఎక్కువగా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. సినిమాలలో నటించడం మొదలుపెట్టిన తరువాత హీరోయిన్లతో లవ్ సన్నివేశాల్లో నటించేప్పుడు కాస్త సిగ్గుగా ఉండేది. తరువాత విషయం తెలుసుకొని కో ఆర్టిస్ట్ లతో మాట్లాడడం మొదలుపెట్టాను. ఇదే మా ఇద్దరి మధ్య సమస్యగ మారింది. నువ్వు చాలా మారిపోయావు అంటూ గొడవలు మొదలయ్యాయి. విడాకుల వరకు వెళ్లింది'' అంటూ తన విడాకులకు కారణం సినిమాలే అంటూ పరోక్షంగా చెప్పుకొచ్చాడు.

ఇప్పటికీ తను ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని,తన కొడుకు భవిష్యత్తు, తన భార్య మంచి కోసం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇప్పటికీ తన భార్య అంటే తనకు ఇష్టం అని తన భార్యకు కూడా అంతే అని.. వారిద్దరూ కలిసి ఉండడం ప్రపంచానికి ఇష్టంలేదేమో అంటూ చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి