క్రిష్ ఈగో హర్ట్ అయింది అందుకే..!

Published : May 07, 2019, 01:04 PM IST
క్రిష్ ఈగో హర్ట్ అయింది అందుకే..!

సారాంశం

గత కొద్దిరోజులుగా దర్శకుడు క్రిష్ కి ఏది కలిసి రావడం లేదు. 

గత కొద్దిరోజులుగా దర్శకుడు క్రిష్ కి ఏది కలిసి రావడం లేదు. ఆయన ఎంతో కష్టపడి తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలకు ఆశించిన ఫలితం రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ కోసం బాలీవుడ్ ప్రాజెక్ట్ 'మణికర్ణిక'ని తొందరగా పూర్తి చేసి మరీ వచ్చాడు. 'మణికర్ణిక' మంచి సక్సెస్ అయినా.. క్రిష్ కి క్రెడిట్ రాకుండా చూసుకుంది కంగనా.

అంతేకాదు.. క్రిష్ 'మణికర్ణిక' కోసం ఏమీ చేయలేదని, అతను సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఎన్టీఆర్ బయోపిక్ చూస్తేనే తెలుస్తోందిగా అంటూ అతడిని అవమానించింది. దీనికి క్రిష్ హర్ట్ అయింది. అందుకే తన తదుపరి సినిమాను బాలీవుడ్ లో తీసి తన టాలెంట్ ఏంటో చూపించాలని నిర్ణయించుకున్నాడు. 

తెలుగులో సినిమా తీసి సక్సెస్ అందుకున్నా బాలీవుడ్ లో కవరేజ్ రాదు కనుక.. హిందీలోనే ఒక భారీ సినిమా తీసి సత్తా చాటుకొని ఆ తరువాత 'మణికర్ణిక' చిత్రాన్ని తన నుండి కనగన ఎలా లాక్కుందనే విషయం మాట్లాడితే వెయిట్ ఉంటుందని క్రిష్ బాలీవుడ్ లో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. 

ఈ విషయం తెలుసుకున్న వారు క్రిష్ ఈ విషయాన్ని చాలా పెర్సనల్ గా తీసుకున్నాడని అంటున్నారు. బాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు క్రిష్.  

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే
Bharani: మూడో సీజన్ నుంచి అడుక్కుంటున్నారు, నాగబాబు వల్ల బిగ్ బాస్ ఆఫర్ రాలేదు..మొత్తం రివీల్ చేసిన భరణి