డైరెక్షన్ కి సిద్దమైన విశాల్.. హాలీవుడ్ తరహాలో ఉంటుందట!

Published : Nov 07, 2018, 07:21 AM IST
డైరెక్షన్ కి సిద్దమైన విశాల్.. హాలీవుడ్ తరహాలో ఉంటుందట!

సారాంశం

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ సెట్ చేసుకున్న కుర్ర హీరోల్లో విశాల్ ఒకరు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే విశాల్ మరో సినిమాను సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నం చేస్తుంటాడు.

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి మార్కెట్ సెట్ చేసుకున్న కుర్ర హీరోల్లో విశాల్ ఒకరు. ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగానే విశాల్ మరో సినిమాను సెట్స్ పైకి తేవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే హీరోగానే కాకుండా డైరెక్టర్ గాను తన టాలెంట్ నిరూపించుకోవడానికి సిద్దమయ్యాడు ఈ మాస్ హీరో. 

త్వరలోనే జంతువులకు సంబందించిన ఒక సోషల్ మెస్సేజ్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పాడు. నిజ జీవితంలో జంతు ప్రేమికులుగా ఉన్నవారే తన సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపిస్తారని విశాల్ వివరణ ఇచ్చాడు. అదే విధంగా ఆ సినిమా హాలీవుడ్ స్థాయిలో ఉంటుందట. క్యాట్స్ అండ్ డాగ్స్ - మార్లి అండ్ మీ వంటి సినిమాల తరహాలో ఉంటాయని తెలుస్తోంది. 

ఇకపోతే ఇటీవల దసరా సందర్బంగా విశాల్ పందెం కోడి 2 సినిమాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మిక్సిడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం సుందర్ సి దర్శకత్వంలో ఒక యాక్షన్ సినిమాతో విశాల్ బిజీగా ఉన్నాడు. 

PREV
click me!

Recommended Stories

Aadarsha Kutumbam: వెంకటేష్‌ హౌజ్‌ నెంబర్‌ బయటపెట్టిన త్రివిక్రమ్‌.. చాలా ఆదర్శ కుటుంబం
సుమ కు బాలకృష్ణ భారీ షాక్, అఖండ 2 దెబ్బకు 14 సినిమాలు గల్లంతు..?