ప్రతి టికెట్ నుంచి ఒక్కో రూపాయి రైతులకు.. రియల్ హీరో ఇతడే!

Siva Kodati |  
Published : May 16, 2019, 01:08 PM IST
ప్రతి టికెట్ నుంచి ఒక్కో రూపాయి రైతులకు.. రియల్ హీరో ఇతడే!

సారాంశం

హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ అయోగ్య విజయపథంలో దూసుకుపోతోంది. తెలుగు సూపర్ హిట్ చిత్రం టెంపర్ కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ అయినప్పటికీ విశాల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. 

హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ అయోగ్య విజయపథంలో దూసుకుపోతోంది. తెలుగు సూపర్ హిట్ చిత్రం టెంపర్ కు ఇది రీమేక్ గా తెరకెక్కింది. రీమేక్ అయినప్పటికీ విశాల్ తనదైన శైలిలో అద్భుతంగా నటించాడంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. అయోగ్యలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. తెలుగులో కాజల్ ఆ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. 

సేవా కార్యక్రమాల్లో విశాల్ ఎప్పుడూ ముందుంటాడు. తమిళ చిత్ర పరిశ్రమ వ్యవహారాల్లో కూడా విశాల్ చురుకుగా పాల్గొంటుంటాడు. ఎలాంటి సమస్య అయినా పరిష్కరానికి విశాల్ తనవంతు కృషి అందిస్తాడు. విశాల్ మరోమారు రైతులకు సాయం అందించి ప్రశంసలు అందుకుంటున్నాడు. అయోగ్య చిత్రం విజయం సాధించడంతో ఈ చిత్రానికి అమ్ముడైన ప్రతి టికెట్ నుంచి ఒక్కో రూపాయని రైతుల సంక్షేమ నిధికి విరాళంగా అందించనున్నట్లు విశాల్ ప్రకటించాడు. 

విశాల్ ఈ తరహాలో విరాళం ప్రకటించడం కొత్త కాదు. గతంలో అభిమన్యుడు చిత్రం విజయం సాధించిన సందర్భంగా కూడా విశాల్ ఇదే విధంగా రైతులకు విరాళం అందించాడు. విరాళాలు అందించే హీరోలు, రైతులకు అందుకునే వారు చాలామందే ఉంటారు. కానీ ప్రతి టికెట్ నుంచి ఒక్కోరూపాయి రైతులకు అందించిన మొదటి హీరో విశాల్ మాత్రమే. విశాల్ త్వరలో హైదరాబాద్ యువతి అనీషాని వివాహం చేసుకోబోతున్నాడు. వీరిద్దరికి ఇప్పటికే నిశ్చితార్థం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?