జీ తెలుగులో 'మిడిల్ క్లాస్ మెలొడీస్'..రేటింగ్ ఎంతొచ్చిందంటే

By Surya PrakashFirst Published Feb 26, 2021, 8:31 AM IST
Highlights

సింపుల్ గా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వచ్చిన చిత్రం ‘‘మిడిల్ క్లాస్ మెలొడీస్’’ . మథ్యతరగతి జీవితాల్లో సాగే చిన్న చిన్న సంఘటనలను ఇతివృత్తం గా చేసుకుని కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు ఈ మూవీని తెరకెక్కించిన విధానం చాలా మందిని ఆకట్టుకుంటుంది. ఓటీటిలో రిలీజైన ఈ సినిమాకు చాలా మంది  కనెక్ట్ అయ్యారు.గుంటూరులో సాగే ఈ కథతో, ఆ క్యారెక్టర్లతో మనందరం ఓ రెండు గంటలు ట్రావెల్ చేసాం అని మెచ్చుకున్నారు. 
 
ఈ చిత్రం రీసెంట్ గా అంటే పిభ్రవరి 14న జీ తెలుగులో ప్రసారం అయ్యింది. టీవీ ప్రేక్షకులకూ ఈ సినిమా బాగానే పట్టినట్లు అనిపిస్తోంది. 5.68 TVR రేటింగ్ తెచ్చుకుంది. ఇలాంటి చిన్న సినిమాకు ఇది చాలా మంచి రేటింగ్ అని చెప్పాలి. ఓటీటిలో చూసినా మళ్లీ టీవీల్లో చూడటానికి జనం ఆసక్తి చూపించటం విశేషం.
 
ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్ తప్ప దాదాపు అందరూ కొత్త మొఖాలే.కానీ వాళ్ల నుండి దర్శకుడు రాబట్టుకున్న ఫెరపార్మెన్స్ సూపర్బ్ అని చెప్పాలి. అలాగే సినిమా ప్రారంభం లో వచ్చే ఫస్ట్ సీన్ నుంచే డైరెక్టర్ తన మార్కు చూపించే ప్రయత్నం చేసాడు.మిడిల్ క్లాస్ వాళ్లు ఎలా మాట్లాడతారు,చిన్న చిన్న వాటికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది దర్శకుడు చక్కగా క్యాచ్ చేసి స్క్రిప్టులో ఇమిడ్చాడు. అలాగే గుంటూరు నేటీవిటీని చక్కగా,సహజంగా చూపించాడు.ఈ మధ్య అందరినీ ఆకట్టుకుంటున్న మలయాళ సినిమాల కోవలో ‘‘మిడిల్ క్లాస్ మెలొడీస్’’ చేరింది. 

 చిత్రం కథ ఇదీ...అనగనగా గుంటూరు దగ్గరలో ఓ విలేజ్ లో రాఘవ (ఆనంద్ దేవరకొండ) అనే కుర్రాడు. అతనికి తను బొంబై చెట్న అద్బుతంగా చేయగలనని పెద్ద నమ్మకం. దాంతో ఈ విలేజ్ లో తన టాలెంట్ వృధా అవుతుందని గుంటూరులో హోటల్ పెట్టుకోవాలని బయిలుదేరతాడు. ఉన్న ఊరు వదిలేసి, బోలెడెంత పెట్టుబడి పెట్టి హోటల్ పెడతానంటే ఎవరు ఒప్పుకుంటారు. కానీ కన్న తల్లితండ్రులు కదా..మొదట కసురుకున్నా ఆ తర్వాత సరే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చి..కాస్తంత ఆర్దిక సాయిం కూడా చేసాడు.

 అయితే అక్కడ నుంచే అసలు కథ మొదలైంది. రాఘవ పెట్టిన వ్యాపారం క్లిక్ అవటానికి దారిలో ఎన్నో అడ్డంకులు..చివరకు ప్రేమించిన అమ్మాయితో సహా ఎవరూ ఎంకరేజ్ చేసేవాళ్లు లేరు. కానీ కుర్రాడు గుంటూరోడు...వెనక్కి తిరక్కూడదనుకున్నాడు. తన హోటల్ బిజనెస్ నిలబెట్టుకున్నాడు. అదే ఎలా నిలబెట్టుకున్నాడు అనేదే కదా మీ ప్రశ్న. దానికి సమాధానం సినిమాలో దొరుకుతుంది.

click me!