విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోటో వైరల్!

Published : Jan 15, 2019, 10:42 AM IST
విశాల్ ని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఫోటో వైరల్!

సారాంశం

తమిళ హీరో, నడిగర్ సంఘం అధ్యక్షుడు విశాల్ ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంబంధిత వర్గాలు ఆ ఫోటోకి సంబంధించి మొదట్లో ఎలాంటి సమాచారం లేకుండా వెలువరించారు.

దీంతో ఫ్యాన్స్ కి కొంచెం సమయం పాటు ఏం అర్ధంకాలేదు. పండగ పూట తమ అభిమాన హీరోని అరెస్ట్ చేయడం ఏంటని అనుకున్నారు. ఇంతలో అది విశాల్ నటించిన 'అయోగ్య' సినిమాకి సంబంధించిందని తెలిసింది.

దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్ రూపొందించిన 'టెంపర్' సినిమాకి రీమేక్ గా 'అయోగ్య'ని తెరకెక్కిస్తున్నారు. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

రాశిఖన్నా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఫిబ్రవరిలో సినిమా టీజర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Rajamouli: అందుకే రాజమౌళి, మంచు మనోజ్ లకు చుక్కలు.. ఆ దేవతలతో పెట్టుకున్నారు, వేణు స్వామి తీవ్ర వ్యాఖ్యలు
Priyanka Chopra: పారిస్‌లో ప్రియాంక - నిక్ రొమాంటిక్ గ్లామర్ షో, పెళ్లై 7 ఏళ్లైనా తగ్గని ప్రేమ..