ప్రకాష్ రాజ్ కి విశాల్ సపోర్ట్!

Published : Apr 13, 2019, 11:48 AM IST
ప్రకాష్ రాజ్ కి విశాల్ సపోర్ట్!

సారాంశం

బెంగుళూరు లోక్ సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సినీనటుడు ప్రకాష్ రాజ్ కి నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్ తన మద్దతు ప్రకటించారు.

బెంగుళూరు లోక్ సభ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేస్తోన్న సినీనటుడు ప్రకాష్ రాజ్ కి నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు విశాల్ తన మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో విశాల్ శుక్రవారం నాడు ఒక వీడియోను విడుదల చేశారు.

అందులో ప్రకాష్ రాజ్ ని పొగుడుతూ మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసి గెలవడమనేది చాలా కష్టమని అన్నారు. అందుకు ధైర్యంతో పాటు ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పం అవసరమని అన్నారు. దానికి సరైన వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నిలిచారని చెప్పారు. 

సొసైటీలో జరిగే మంచి విషయాలను స్వాగతిస్తూ.. చెడు విషయాలను ప్రశ్నిస్తున్న వ్యక్తిగా ప్రకాష్ రాజ్ నిలిచారని పొగడ్తలు కురిపించారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని, లోక్ సభ స్థానంలో 'విజిల్' గుర్తుపై పోటీ చేస్తోన్న ఆయనకి తాను 'విజిల్' వేసి అభినందిస్తున్నానని అన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ విజయం సాధించి.. ప్రజలకు అండగా నిలబడాలని కోరుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

రామ్ చరణ్ పెద్ది కోసం మృణాల్ ఠాకూర్ ఐటమ్ సాంగ్..? రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?
బాలకృష్ణ సినిమాలో నటించమని అడిగితే గెటౌట్ అని గెంటేసిన లెజెండ్రీ నటి, కట్ చేస్తే దిమ్మ తిరిగే బ్లాక్ బస్టర్