మహేష్ కి వీసా ఇబ్బందులు!

Published : Sep 24, 2018, 11:05 AM IST
మహేష్ కి వీసా ఇబ్బందులు!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' అనే సినిమాలో నటిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా టైటిల్ తో పాటు మహేష్ లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. టైటిల్ తోనే సినిమా భారీ క్రేజ్ ని సొంతం చేసుకుంది.

మహేష్ సింపుల్ గా నడిచొస్తోన్న టీజర్ ని విడుదల చేసి ఫ్యాన్స్ ని ఖుషీ చేసింది చిత్రబృందం. నిజానికి ఇప్పుడు ఈ సినిమా షెడ్యూల్ అమెరికాలో ప్రారంభం కావాల్సివుంది. కానీ వీసా విషయంలో ఇబ్బందులు తలెత్తడంతో షూటింగ్ కాస్త అక్టోబర్ కి వాయిదా పడింది.

అక్టోబర్ రెండో వారంలో అమెరికాలో షెడ్యూల్ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాదాపు 25 రోజులు పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. సినిమాకు సంబంధించిన రెండు పాటలతో పాటు కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీకరించనున్నారు.

ప్రస్తుతం షూటింగ్ వాయిదా పడడంతో మహేష్ ఈ గ్యాప్ ని కుటుంబం కేటాయిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి థాయ్‌లాండ్‌ కి వెకేషన్ కి వెళ్లాడు. ఇక 'మహర్షి' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి