నక్సలైట్ తో సాయి పల్లవి ఇంటర్వ్యూ!

Published : Jun 19, 2019, 03:54 PM IST
నక్సలైట్ తో సాయి పల్లవి ఇంటర్వ్యూ!

సారాంశం

విరాటపర్వం కథ లీకైందంటూ వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడట. 

దగ్గుబాటి రానా విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. బాహుబలి చిత్రంలో విలన్ పాత్రలో నటించినప్పటికీ రానాకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం రానా వేణు ఊడుగుల దర్శకత్వంలో విరాటపర్వం చిత్రంలో నటిస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్. ఇటీవల ఈ చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం దర్శకుడు సాయి పల్లవికి సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు. 

విరాటపర్వం కథ లీకైందంటూ వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రానా నక్సలైట్ పాత్రలో కనిపిస్తాడట. అడవుల్లోకి వెళ్లి రానాని ఇంటర్వ్యూ చేసే జర్నలిస్ట్ పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రానా సమాజంలోకి వచ్చి రాజకీయ నాయకుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తాడట. రానా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ఇందులో ఆసక్తికర అంశం. దీనితో దర్శకుడు నక్సలిజాన్ని, రాజకీయాలని మిళితం చేసి చూపించబోతున్నాడు.  

ఈ చిత్రంలో సీనియర్ నటి టబు కీలక పాత్రలో నటించనుంది. వేణు ఊడుగుల నీదీ నాదీ ఒకే కథ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. విరాట పర్వం చిత్రాన్ని సురేష్ బాబు భారీస్థాయిలో నిర్మించనున్నారు. ఈ చిత్రం తర్వాత రానా భారీ బడ్జెట్ చిత్రం హిరణ్యకశ్యపలో నటించాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా