
మహిళా దినోత్సవం సందర్భంగా స్పెషల్ గా విష్ చేశారు.. రానా విరాటపర్వం మూవీ డైరెక్టర్ వేణు ఉడుగుల.
రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై వేణు ఉడుగుల దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా విరాటపర్వం. ప్రియమణి, ఈశ్వరీ రావ్ లాంటి స్టార్స్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు నటిస్తున్న ఈసినిమా రిలీజ్ పై ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు.
లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 30 నుంచి ఇప్పటి వరకూ దాదాపు మూడు రిలీజ్ డేట్లు మార్చుకుంటూ రిలీజ్ ముహూర్తం కోసం ఎదురు చూస్తోంది విరాటపర్వం మూవీ. ఈ సినిమా స్టార్ట్ అయ్యి దాదాపు మూడేళ్లు పైనే అవుతుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన విరాటపర్వం మూవీ లో ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు.
ఈ మూవీ నుంచి లాస్ట్ ఇయర్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోను ఈరోజు డైరెక్టర్ వేణు ఉడుగుల పోస్ట్ చేశారు. మహిళలకు స్పెషల్ గా ఉమెన్స్ డే విశెష్ చెప్పారు. ఈ వీడియోలో విరాటపర్వంలో నటించిన మహిళలంతా కలిసి ఉన్నారు.
రివల్యూషన్ ఈజ్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ ట్యాగ్ లైన్ తో రూపొందిన విరాటపర్వం మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొవిడ్ డిలే తో పాటు.. మరికొన్ని కారణాల వల్ల ఈసినిమా రిలీజ్ లేట్ అవుతుంది.