
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు.. యంగ్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆమెకు ఏమయ్యిందా అని ఆరా తీయ్యడం స్టార్ట్ చేశారు. అయితే అసలు విషయం ఏంటీ అంటే పోస్ట్ కోవిడ్ వల్ల మరోసారి ఆమెకు అనారోగ్యం కలగడంతో సోమవారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఐశ్వర్య కరోనా బారిన పడడంతో ఫిబ్రవరి 1న హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు.
అయితే కరోనాకు ట్రీట్మెంట్ తీసుకన్న ఐశ్వర్య కోలుకోవడంతో ఆమె డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం ముసాఫిర్ అనే మ్యూజిక్ వీడియో షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు ఐశ్వర్య. అయితే కరోనాకు ముందు కంటే కరోనా తరువాత ఆమయె ఎక్కుంగా అనారోగ్యానికి గురవుతున్నట్టు తెలుస్తోంది. తరచూ అధిక జ్వరం, తల తిరగడం లక్షణాలు కనిపిస్తుండటంతో ఆమె మళ్లీ ఆసుపత్రిలో చేరారు.
ఈ విషయాన్న ఐశ్వర్య స్వయంగా తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. పక్కన డాక్టర్ తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. ఎంతో స్ఫూర్తి నీయమైన, గొప్ప మహిళా డాక్టర్ ప్రీతికా చారిని కలవడం, ఆమె తనకు సమయం వెచ్చించడం గర్వంగా ఉందని పోస్ట్ లో రాసుకొచ్చారు ఐశ్వర్య రజనీ కాంత్ .
ఇక ఇదిలావుంచితే, ఐశ్వర్య స్టార్ హీరో ధనుష్ విడిపోతున్నట్టు ఈ ఏడాది జనవరి 17న ప్రకటించారు. తమ 18 ఏళ్ళ వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్టు ప్రకటించారు వీరిద్దరు.ఈవిషయం తమిళనాడులో సంచలనం సృష్టించింది. ముఖ్యంగా అభిమానులను షాక్ కు గురి చేసింది. మళ్లీ వీళ్ళిద్దరూ కలవాలని వారు కోరకుకుంటున్నారు.