యూఎస్ ప్రీమియర్ షో టాక్: వినయ విధేయ రామ

By Prashanth MFirst Published Jan 11, 2019, 6:26 AM IST
Highlights

రంగస్థలం సినిమాలో చెవిటి పాత్రలో నటించి ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి అందుకు భిన్నంగా పక్కా కమర్షియల్ మూవీతో సంక్రాంతి భరిలోకి దిగుతున్నాడు.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక యూఎస్ లో ప్రవాసుల కోసం స్పెషల్ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందో చూద్దాం.

రంగస్థలం సినిమాలో చెవిటి వాడిగా నటించి ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సారి అందుకు భిన్నంగా పక్కా కమర్షియల్ మూవీతో సంక్రాంతి భరిలోకి దిగుతున్నాడు.  బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన వినయ విధేయ రామ నేడు వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. ఇక యూఎస్ లో ప్రవాసుల కోసం స్పెషల్ ప్రీమియర్స్ ను ప్రదర్శించారు. ఆ టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఐదుగురు అన్నదమ్ములతో మొదలయ్యే ఈ కథ చిన్ననాటి పాత్రలతో ఫస్ట్ ఫ్యామిలీ ఆడియెన్స్కి కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇక పెద్దయ్యాక రామ్ ( చరణ్) యాక్షన్ బ్లాక్ తో స్క్రీన్ ఎంట్రీ ఇస్తాడు. రామ్ పెద్దన్నయ్య ప్రశాంత్ ఒక ఎలక్షన్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తుండగా అనుకోకుండా విలన్స్ తో వివాదం చెలరేగుతుంది. అనంతరం ఇంటర్వెల్ బ్లాక్ లో చరణ్ తన విశ్వరూపాన్ని చూపిస్తాడు. మంచి ట్విస్ట్ తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది.

ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తుంది. ఇక ఇంటర్వెల్ అనంతరం మెయిన్ విలన్ వివేక్ ఒబేరాయ్ రంగంలోకి దిగుతాడు. ఆ సీన్స్ బోయపాటి శైలిని గుర్తు చేస్తాయి. ఇక కుటుంబాన్ని కంటికి రెప్పలా కథానాయకుడు ఎలా కాపాడుకున్నాడు? అలాగే తన బాధ్యతను ఎలా నిర్వర్తించాడు అనే అంశాలు బావున్నప్పటికి మెయిన్ కథలో పెద్దగా కొత్తదనం ఏమి ఉండదు. సినిమా కథలో బోయపాటి ఎప్పటిలానే మంచి యాక్షన్ సీన్స్ ను సెట్ చేసుకున్నప్పటికి మితిమీరిన యాక్షన్ డోస్ అన్నట్లుగా ఆలోచనను రప్పిస్తుంది.

ఫ్యామిలీ కి సంబంధించిన ఎమోషనల్ సీన్స్ అక్కడక్కక్స ఫైట్స్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయి. మెయిన్ గా పాటల్లోని చరణ్ డ్యాన్స్ అభిమానులకు మంచి కిక్ ఇస్తాయి. అయితే సినిమా అంచనాలను అందుకోలేదనే టాక్ అయితే వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంతో పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక కెమెరా పనితనం సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ కాగా ఇంటర్వెల్ పాయింట్ సూపర్బ్ అని చెప్పవచ్చు. మరి ఈ ఫెస్టివల్ సీజన్ లో సినిమా ఏ స్థాయిలో హిట్ అవుతుందో చూడాలి.

click me!