కిరణ్ అబ్బవరం `ఎస్ ఆర్ కళ్యాణమండపం` సినిమా సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా యంగ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం ప్రస్తుతం `వినరో భాగ్యము విష్ణు కథ` చిత్రంలో నటించారు. ఈ చిత్రం నేడు శనివారం(ఫిబ్రవరి 18) మహాశివరాత్రి సందర్భంగా విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కిరణ్ అబ్బవరం `ఎస్ ఆర్ కళ్యాణమండపం` సినిమా సక్సెస్‌తో టాలీవుడ్‌లో ఒక్కసారిగా యంగ్ సెన్సేషన్‌గా మారిపోయాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కేవలం టాలెంట్‌ని నమ్ముకుని వచ్చాడు, నిలబడ్డాడు. నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. కానీ గత సినిమాలు ఆయనకు ఆశించిన రిజల్ట్ నివ్వలేదు. హిట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం `వినరో భాగ్యము విష్ణు కథ` చిత్రంలో నటించారు. ఇది అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ లో జీఏ2 బ్యానర్‌పై నిర్మితమైన సినిమా కావడం విశేషం. బన్నీ వాసు నిర్మాతగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం నేడు శనివారం(ఫిబ్రవరి 18) మహాశివరాత్రి సందర్భంగా విడుదలైంది. అంతకు ముందు శుక్రవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథః
విష్ణు(కిరణ్ అబ్బవరం) లైబ్రరీలో పనిచేస్తుంటాడు. చిన్నప్పుడే అమ్మానాన్న చనిపోతారు. మంచి తనం, ఇతరులకు సహాయం చేయడం అతని లక్షణం. నంబర్ నైబరింగ్ అనే ఐడియాతో తనకు దర్శణ(కాశ్మీరి పరదేశి) అనే అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఆమె యూట్యూబర్. ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటుంది. కానీ కాలేదు. నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్ తో అయినా వీడియోలు చేసి వ్యూస్ పొంది పాపులర్ కావాలనుకుంటుంది. అందుకు విష్ణు సహాయం తీసుకుంటుంది. తనకు అటుగా ఉన్న మరో నెంబర్ అయిన శర్మ(మురళీ శర్మ)ని కూడా కలిసి అతనితో పాపులర్ తెలుగు పాటలకు డాన్సులు చేస్తూ బాగా పాపులర్ అయిపోతారు. ఈ క్రమంలో దర్శణ, విష్ణు ప్రేమలో పడతారు. అయితే అనుకోకుండా దర్శణ మరింత క్రేజ్ కోసం లైవ్ మర్దర్ ప్లాన్ చేస్తుంది. ఫ్రాంక్‌గా శర్మని లైవ్ మర్దర్ చేయాలనుకుంటుంది. కానీ ఈ ఫ్రాంక్ కాస్త నిజం అవుతుంది. శర్మ చనిపోతాడు. దీంతో దర్శణకి ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది. మరి నిజంగానే దర్శణ శర్మని చంపిందా? దీని వెనకాల మరెవరైనా ఉన్నారా? నెంబర్ నైబరింగ్ కథకి, టెర్రరిస్టులకు సంబంధం ఏంటి? అనంతరం కథ ఎలాంటి మలుపులు తిరిగింది? దీనికి పారలల్‌గా జరుగుతున్న మరో కథేంటి? అనేది మిగిలిన సినిమా.
undefined
విశ్లేషణః
కిరణ్ అబ్బవరం ఏదో ఒక మంచి సందేశాన్ని అందించే కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ సారి నెంబర్ నైబరింగ్ అనే వినూత్న కాన్సెప్ట్ తో వచ్చాడు. కాన్సెప్ట్ కొత్తగానే ఉంది కానీ, సినిమా సాగిన తీరు మాత్రం రెగ్యూలర్ కమర్షియల్ వేలోనే ఉండటం విశేషం. ఫస్టాఫ్ మొత్తం ఎంటర్‌టైనింగ్ వేలో తీసుకెళ్లాడు దర్శకుడు. సరదా సన్నివేశాలతో సాగిపోతుంటుంది. మధ్యమధ్యలో హీరో మంచితనం తాలుకూ సన్నివేశాలతో ఎంటర్‌టైన్‌మెంట్‌కి బ్రేకులు వేశారు. ఇక పాపులారిటీ కోసం హీరోయిన్ మురళీ శర్మతో చేసే వీడియోలు నవ్వులు పూయిస్తాయి. ఆయా సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయి. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కంటే హీరోయిన్, మురళీ శర్మల మధ్య వచ్చే సీన్లే బాగా ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం విశేషం.
మరోవైపు ఇంటర్వెల్‌లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది. దర్శన.. శర్మని ఎందుకు చంపిందనే ఉత్కంఠకి గురి చేస్తుంది. సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అయితే దీని వెనకాల ఓ పెద్ద కుట్ర ఉందని తెలుసుకున్న హీరో దాన్ని ఛేదించేందుకు, జైల్లో శిక్ష అనుభవిస్తున్న హీరోయిన్‌ని నిర్ధోషిగా బయటకు తీసుకు వచ్చేందుకు చేసే ప్రయత్నాలు సినిమా వేగాన్ని తగ్గించాయి. కాస్త బోర్ తెప్పిస్తుంటాయి. క్లైమాక్స్ వరకు కథ లేకపోవడంతో బాగా లాగాడు దర్శకుడు. మళ్లీ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ సినిమాకి మరో హైలైట్‌గా నిలుస్తుంది. ఆ తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. కానీ సెకండాఫ్ మొత్తం సీరియస్‌గా సాగడం, వినోదం మిస్ కావడం, హీరో, హీరోయిన్లు, హత్యకు సంబంధించిన ఎపిసోడ్లతోపాటు మధ్య మధ్యలో వేరే సన్నివేశాలతో కాస్త గజిబిజిగా అనిపిస్తుంది.
నెంబర్ నైబరింగ్‌తో టెర్రరిస్ట్ లను ట్రాక్ చేయడం వంటి సన్నివేశాలు బాగున్నాయి. అయితే సినిమా ముగిసిపోయిందని అంతా భావించిన తర్వాత టెర్రరిస్టుల ఎపిసోడ్ పెట్టడం సినిమా ట్రాక్ తప్పిందా అనే ఫీలింగ్ తెప్పిస్తాయి. అవసరం లేని చాలా సన్నివేశాలు సినిమా ఫ్లోని దెబ్బతీసేవిగా ఉంటాయి. మెయిన్ స్టోరీకి పారలల్‌గా ఇతర కథను నడిపించడం, వాటిని లింక్ చేసే విషయంలో మరింత స్పష్టత అవసరం. హీరో క్లాస్‌లు పీకడాలు, హితభోద చేయడాలు ఎక్కువైపోయినట్టుగా ఉంటుంది. కానీ క్లైమాక్స్ లోని చివరి ట్విస్ట్ సైతం బాగుంది. ఓవరాల్‌గా సినిమా సరదాగా టైమ్ పాస్ చేసే మూవీ అవుతుందని చెప్పొచ్చు.
నటీనటులుః
విష్ణు పాత్రలో కిరణ్ అబ్బవరం బాగా చేశాడు. గత చిత్రాలతో కాస్త బెటర్‌గా అనిపించాడు. యాక్టింగ్‌లో మోనోటనీ తగ్గించాడు. ఇంకా తగ్గించాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఇమేజ్ తాలుకూ సన్నివేశాలు ఫ్యాన్స్ ఎంజాయ్ చేసేలా ఉన్నాయి. అదే సమయంలో కొంత అతిగా అనిపిస్తుంటాయి. దర్శణపాత్రలో కాశ్మీరి పరదేశీ బాగా చేసింది. శర్మగా మురళీ శర్మ ఇరగదీశాడు. ప్రవీణ్ పర్వాలేదనిపించాడు. మిగిలిన పాత్రలు ఉన్నంతలో ఓకే అనిపిస్తాయి.
టెక్నీషియన్లుః
దర్శకుడు మురళీకిషోర్ కాంప్లికేటెడ్ కథని చాలా బాగా డీల్ చేశాడు. అప్ కమింగ్ డైరెక్టర్ అయినా మూడు పారలల్ స్టోరీలను లింక్ చేసిన తీరు బాగుంది. కాకపోతే ఆయన అనుభవం సరిపోలేదనిపిస్తుంది. హీరో చేత హితభోద చేయించడాలు, ప్రవచనాలు చెప్పించడం ఓవర్‌గా ఉన్నా, ఎంటర్‌టైనింగ్‌గా ఉండటం విశేషం. ఏదేమైనా దర్శకుడు మంచి ప్రయత్నం చేశాడని చెప్పొచ్చు. చైతన్య భరద్వాజ్ సంగీతం సినిమాకి పెద్ద అసెట్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పాటలు బాగున్నాయి. సినిమాని ఎంగేజ్ చేసేలా ఆర్‌ఆర్ ఉంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్‌కి కొంత పని చెప్పాల్సింది. కెమెరా వర్క్ బాగుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి, ఏడుకొండలను చూపించిన తీరు బాగుంది. ఇదే చాలా మంది ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అవుతారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గీతా ఆర్ట్స్ నిర్మాణలు విలువలు బాగున్నాయి.
ఫైనల్‌గాః థ్రిల్లర్, యాక్షన్, సస్పెన్స్ మేళవింపుగా సాగే ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. జస్ట్ టైమ్ పాస్ మూవీ.
రేటింగ్‌ః 2.75