ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ... ఫ్లైట్ ఎక్కిన ఆ 100 మంది!

Published : Feb 17, 2023, 09:09 PM ISTUpdated : Feb 17, 2023, 10:16 PM IST
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ... ఫ్లైట్ ఎక్కిన ఆ 100 మంది!

సారాంశం

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ చర్యలు కొంచెం  భిన్నంగా ఉంటాయి. ఆయన ఏకంగా వంద మంది అభిమానులను ట్రిప్ కి పంపారు. 


ఇటీవల విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా కాంటెస్ట్ నిర్వహించారు. తాను ఎలాంటి ట్రిప్ కి వెళ్లాలో సూచించాలని ఒక పోల్ పోస్ట్ చేశాడు. సదరు పోల్ లో పాల్గొన్న లక్కీ 100 ఫ్యాన్స్ కి ఫ్రీగా ట్రిప్ ఏర్పాటు చేస్తాను అన్నారు. విజయ్ ప్రకటనకు లక్షల్లో స్పందించారు. విజయ్ దేవరకొండ  నిర్వహించిన పోల్ నందు పాల్గొన్నారు. వీరిలో 100 లక్కీ ఫ్యాన్స్ ని విజయ్ దేవరకొండ సెలెక్ట్ చేశారు. హామీ ఇచ్చినట్లే వారిని ట్రిప్ కి పంపారు. 

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గల కులు మనాలికి సదరు లక్కీ ఫ్యాన్స్ వెళుతున్నారు. ఫ్లైట్ ఎక్కాక... తమ ఆనందం తెలియజేస్తూ వీడియో షేర్ చేశారు. విజయ్ దేవరకొండ ఫ్రీ మనాలి ట్రిప్ కి సెలెక్ట్ అయిన ఫ్యాన్స్ వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వంద మందికి కులు మనాలి ట్రిప్ అంటే మామూలు విషయం కాదు. లక్షల్లో ఖర్చు అవుతుంది. విజయ్ తన సొంత డబ్బులతో ఈ ట్రిప్ ఏర్పాటు చేశారు. 

ఎంత కోట్ల సంపాదన ఉన్నా.. ఇలాంటి క్రేజీ గిఫ్ట్స్ ఫ్యాన్స్ కి ఇచ్చే మనసు ఉండాలి కదా. విజయ్ దేవరకొండను పలువురు కొనియాడుతున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ ఖుషి చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తుండగా శివ నిర్వాణ దర్శకుడు. అలాగే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి, పరుశురాం చిత్రాలకు సైన్ చేశారు. విజయ్ గత చిత్రం లైగర్ అనుకున్న స్థాయి ఆడలేదు. హిట్ కావాలన్నా అంటూ ఫ్యాన్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. 

 విజయ్ దేవరకొండ అభిమానులతో ఆన్లైన్ చాట్ చేశారు. ఫ్యాన్స్ అడిగిన పలు విషయాలకు సమాధానాలు చెప్పారు. కాగా ఓ అభిమాని ఒక్క హిట్ ఇవ్వన్నా... అంటూ తన అసహనం బయటపెట్టాడు. హిట్ ఒకటే పెండింగ్ రా. హిట్టు కొట్టాలి. నెక్స్ట్ కొడదాం... అని విజయ్ దేవరకొండ సమాధానం చెప్పారు. ఖుషి మూవీతో మనం హిట్ కొట్టబోతున్నామన్నా అని ఇతర ఫ్యాన్స్ ఆయనకు హామీ ఇచ్చాడు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?