కోడల్ని కూతురిలా చూసుకుంటా..అయినా నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు, తల్లి ఉష కామెంట్స్

Published : Dec 29, 2023, 05:35 PM IST
కోడల్ని కూతురిలా చూసుకుంటా..అయినా నాగశౌర్య పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టాడు, తల్లి ఉష కామెంట్స్

సారాంశం

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తన కష్టంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇటీవల నాగ శౌర్యకి అంతగా హిట్స్ లేవు. అయినా పొటెన్షియల్ ఉన్న హీరోగా గుర్తింపు పొందాడు.

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య తన కష్టంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు. ఇటీవల నాగ శౌర్యకి అంతగా హిట్స్ లేవు. అయినా పొటెన్షియల్ ఉన్న హీరోగా గుర్తింపు పొందాడు. అయితే గత ఏడాది నవంబర్ లో నవంబర్ లో నాగ శౌర్య కర్ణాటకకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే పెళ్లి కాగానే నాగ శౌర్య తల్లిదండ్రులతో ఉండకుండా వేరే కాపురం పెట్టాడట. ఈ విషయాన్ని నాగ శౌర్య తల్లి ఉష ప్రసాద్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసారు. అనూష నాకు పెళ్ళికి కొన్ని నెలల ముందే తెలుసు. చాలా మంచి అమ్మాయి. నేను ఆమెని కూతురిలా చూసుకుంటా. అనూష నన్ను మమ్మా అని పిలుస్తుంది. నా భర్తని డాడీ అంటుంది. 

చాలా మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి. ఇంటీరియర్ డిజైనర్ గా బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్ని పనులు తానే చక్కబెట్టేస్తుంది. శౌర్య, అనూష ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. అయితే నాగశౌర్య, అనూష పెళ్లి తర్వాత వేరే కాపురం పెట్టారు. అత్త కోడళ్ల మధ్య అంత అన్యోన్యత ఉన్నప్పుడు వేరే కాపురం అవసరం ఏంటి అనే అనుమానం రావచ్చు. 

అయితే అది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు. పెళ్ళికి ముందే అనుకున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ పిల్లకు ప్రైవసీ ఇవ్వడం బెటర్. దూరంగా ఉండి అప్పుడప్పుడూ కలుసుకుంటుంటే బంధాలు బావుంటాయి. తల్లిదండ్రులుగా మా అభిప్రాయం కూడా ఇదే అని ఉష ప్రసాద్ అన్నారు. పెద్ద కోడలు వాళ్ళు అమెరికాలో సెటిల్ అయినట్లు తెలిపారు. ఉష ప్రసాద్ నిర్మాతగా నాగ శౌర్యతో సినిమాలు చేస్తున్నారు. అలాగే రీసెంట్ గా రెస్టారెంట్ బిజినెస్ కూడా ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ అభిమానుల మధ్య నలిగిపోయిన నిధి అగర్వాల్, రాజాసాబ్ ఈవెంట్ లో స్టార్ హీరోయిన్ కు చేదు అనుభవం..
Gunde Ninda Gudi Gantalu Today: ‘ఇతను ఎవరో నాకు తెలీదు’ మౌనిక మాటకు పగిలిన బాలు గుండె, మరో షాకిచ్చిన శ్రుతి