'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ ఈమేనా..?

Published : Jul 23, 2019, 02:29 PM ISTUpdated : Jul 23, 2019, 03:45 PM IST
'RRR': ఎన్టీఆర్ హీరోయిన్ ఈమేనా..?

సారాంశం

RRR లో ఎన్టీఆర్ సరసన ముందుగా ఓ హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో మరో హాలీవుడ్ నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన అమెరికన్ నటి, గాయని ఎమ్మారాబర్ట్స్ ని 'RRR'లో హీరోయిన్ గా ఎంపిక చేశారట  

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి 'RRR' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.

సినిమాలో రామ్ చరణ్ సరసన అలియాభట్ హీరోయిన్ గా కనిపించనుంది. ఎన్టీఆర్ సరసన ముందుగా ఓ హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ని ఎంపిక చేశారు. అయితే ఆమె కొన్ని కారణాల వలన ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది. దీంతో ఆ క్యారెక్టర్ ని మార్చేశారని, ఫారెన్ అమ్మాయిని తీసుకోవాల్సిన అవసరం లేదని కొన్ని వార్తలు వినిపించాయి. 

కానీ చిత్రబృందం మాత్రం మరో హాలీవుడ్ నటి కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఓ ఫారెన్ నటిని తీసుకున్నట్లు సమాచారం. అమెరికన్ నటి, గాయని ఎమ్మారాబర్ట్స్ ని 'RRR'లో హీరోయిన్ గా ఎంపిక చేశారట.

ఇప్పటికే ఎమ్మారాబర్ట్స్ పలు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. తొలిసారి ఆమె ఓ ఇండియన్ సినిమాలో నటించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ సరికొత్త గెటప్పుల్లో ఈ సినిమాలో కనిపించనున్నారు. 

PREV
click me!

Recommended Stories

BMW First Review: `భర్త మహాశయులకు విజ్ఞప్తి` మూవీ ఫస్ట్ రివ్యూ.. రవితేజ కాలర్‌ ఎగరేసే టైమ్‌ వచ్చిందా?
Sudigali Sudheer Rashmi Gautam లవ్‌ స్టోరీ తెగతెంపులు.. అందరి ముందు ఓపెన్‌గా ప్రకటించిన జబర్దస్త్ కమెడియన్‌