
మరో సాహసానికి రెడీ అయ్యాడు తమిళ సీనియర్ స్టార్ హీరో విక్రమ్. కోలీవుడ్ లో ప్రయోగాలు చేయాలంటే ముందుంటాడు చియాన్. ఇక మరో ప్రయోగానికి విక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట.
తమిళంలో ప్రయోగాత్మక సినిమాలకు పెట్టింది పేరు చియాన్ విక్రమ్. చిత్ర విచిత్రమైన గెటప్పులు చేయాలంటే ముందుగా గుర్తుకు వచ్చేపేరు విక్రమ్. పాత్ర కోసం ఎంత కష్టపడటానికైనా విక్రమ్ రెడీగా ఉంటాడు. అది ఇది అని లేదు... పాత్ర ఎంత ఇబ్బంది కరంగా ఉన్నా సరే .. దానికి వంద శాతం న్యాయం చేస్తాడు. ఇంకా చేయాలన్నా సరే ఆయన సిద్ధంగా ఉంటారు.
విక్రమ్ టాలెంట్ కు మచ్చుతునకల్లాంటి సినిమాలు అపరిచితుడు,ఐ సినిమాలు.ఇక విక్రమ్ చేసిన మరో ప్రయోగాత్మక సినిమా మహాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. గతంలో ఆయన డ్యూయల్ రోల్ చేసిన ఇంకొక్కడు సినిమా కూడా ఆయన ప్రయోగాలలో ఒకటే. ఇక ఇప్పుడ కూడా ఆయన ఎక్స్ పెర్మెంట్స్ వైపే ఆలోచిస్తున్నాడు.
ఇక కరోనా తరువాత విక్రమ్ సినిమా థియేటర్లకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద ప్రాజెక్టులే ఉన్నాయి. వాటిలో మే 26న కోబ్రా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో దాదాపు 25 పాత్రల్లో విక్రమ్ కనిపించబోతున్నాడు. ఆయన కెరీర్ లో అతి పెద్ద ప్రయోగం ఇదే. ఇక ఈసినమాతో పాటు మణిరత్నం తో పాటు పొన్నియన్ సెల్వన్ మూవీ చేస్తున్నాడు విక్రమ్.
మణిరత్నం దర్శకత్వంలో చేసిన పొన్నియిన్ సెల్వన్ లైన్లోనే ఉంది. త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఇక ఈ నేపథ్యంలోనే విక్రమ్ మరో సినిమాను అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇటీవలే మురుగదాస్ .. విక్రమ్ ను కలిసి ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. ఆ సినిమా చేయడానికి వెంటనే ఆయన ఒప్పుకున్నాడని తెలుస్తోంది.
ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబధించి ఇతర నటీనటులు ఎవరు..? హీరోయిన్ ఎవరు అని త్వరలోనే వివరాలు తెలియచేస్తామన్నారు.