
చాలా కాలం పాటు ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి కెప్టెన్ గా వ్యవహరించడం వల్ల డేవిడ్ వార్నర్ తో ఫ్యాన్స్ ఎమోషనల్ గా అటాచ్ అయ్యారు. వార్నర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయినప్పటికీ మనవాడే అన్నంతగా ఫ్యాన్స్ అతడిపై అభిమానం చూపారు. దీనితో వార్నర్ కి కూడా హైదరాబాద్ అంటే బాగా ఇష్టం ఏర్పడింది.
అలాగే తెలుగు సినిమాలు,సౌత్ సినిమాలపై కూడా వార్నర్ మక్కువ పెంచుకున్నారు. తెలుగు మూవీస్, సౌత్ మూవీస్ కి సంబంధించిన వీడియోలతో వార్నర్ వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యారు. అల వైకుంఠపురములో చిత్రంలో బుట్టబొమ్మ సాంగ్ స్టెప్పుల నుంచి అనేక చిత్రాల్లో ఫేమస్ డైలాగ్స్ చెబుతూ ఇంస్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయ్యాడు డేవిడ్ భాయ్.
దీనితో వార్నర్ ఇంస్టాగ్రామ్ లో ఏ చిత్రానికి సంబంధించిన వీడియో చేసినా క్షణాల్లో వైరల్ కావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా వార్నర్ మరో అద్భుతమైన వీడియోతో అదరగొట్టాడు. ఇటీవల విడుదలైన సంచలనం సృష్టిస్తున్న కేజిఎఫ్ 2 చిత్రంలోని డైలాగ్స్ తో వార్నర్ అదరగొట్టాడు. యష్ చెబుతున్న డైలాగ్స్ కి లిప్ సింక్ ఇచ్చాడు.
కేజిఎఫ్ లో బాగా ఫేమస్ అయిన 'వైలెన్స్ వైలెన్స్' అనే డైలాగ్స్ చెబుతున్నాడు. ఈ వీడియోలో డేవిడ్ వార్నర్ యాటిట్యూడ్ విషయంలో యష్ కంటే ఏమాత్రం తగ్గడం లేదు. తాను బ్యాట్ ఝుళిపిస్తున్న విజువల్స్ కూడా ఈ వీడియోలో బాగా సింక్ అయ్యాయి.
ఈ వీడియోకకి 24 గంటలు ముగియకుండానే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ 2 చిత్రం తెరకెక్కింది. కేజీఎఫ్ మొదటి భాగాన్ని మించేలా హాలీవుడ్ స్థాయిలో రెండవ భాగాన్ని చిత్రీకరించారు. కళ్ళు చెదిరే యాక్షన్ ఎపిసోడ్స్ థియేటర్స్ లో కేక పెట్టిస్తున్నాయి.