టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (Thaman) భారీ ప్రాజెక్ట్స్ కు సంగీతం అందిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. కాస్తా సమయం కేటాయించి తాజాగా ఓ ఇంటరవ్యూ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ‘బ్రో’, మహేశ్ బాబు ‘గుంటూరు కారం’పై, ఆయా అంశాలపై ఇంట్రెస్టింగ్ గా స్పందించారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు మారుమోగుతోంది. బిగ్ స్టార్స్ సినిమాలకు ఈయనే సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. మరిన్ని కొత్త ప్రాజెక్ట్స్ కు కూడా థమన్ మ్యూజిక్ అందించబోతున్నారు. ప్రస్తుతం మాత్రం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరియు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన చిత్రం Bro The Avatarకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈనెల 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.
‘బ్రో : ది అవతార్’పై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఇక హైదరాబాద్ లో తాజాగా థమన్ ఇచ్చిన ఇంటర్వ్యూతో మరింతగా ఆసక్తి నెలకొంది. తన ఇంటర్వ్యూలో Bro సినిమా గురించి థమన్ ఇంట్రెస్టింగ్ డిటేయిల్స్ వెల్లడించారు. థమన్ మాట్లాడుతూ.. బ్రో చిత్రంలో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫామెన్స్ వేరే లెవల్లో ఉంటుంది. గతంలో చూసిన పవన్ కాకుండా కొత్తఅవతారం కనిపిస్తుంది. కొన్ని హార్ట్ టచ్చింగ్ మూమెంట్స్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను తప్పకుండా ఆకట్టుకుంటాయి. సముద్రఖని చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ఇక మ్యూజిక్ విషయానికొస్తే బీజీఎంపై చాలా శ్రద్ధ వహించాం. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఇంట్రో బైట్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పవర్ స్టార్ స్థాయికి తగ్గేలా, హై వచ్చేలా కంపోజ్ చేశాం.
ఇందులో మూడు పాటలు సమకూర్చాం. ఇక త్వరలో సినిమా ముగింపు సమయంలో వచ్చే సాంగ్ ను చాలా సర్ ప్రైజింగ్ ప్లాన్ చేశాం. ఆ సాంగ్ ‘టైమ్’ గురించి ఉంటుంది. ఆ సాంగ్ చాలా బాగా ఉంటుంది. దాన్ని ప్రమోషనల్ సాంగ్ గా కంపోజ్ చేశాం. అయితే, ఆ ట్రాక్ ను సినిమా విడుదలకు ముందు విడుదల చేయనున్నామన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. పవన్ కు వరుసగా మూడు చిత్రాలకు సంగీతం అందించానన్నారు. అవన్నీ రీమేక్ సినిమాలేనని. అయితే అలాంటి సినిమాలకు కత్తిమీద సాము లాంటిదన్నారు. అయినా చాలా శ్రద్ధవహించి పనిచేశామని, తగ్గట్టుగానే రిజల్ట్ వచ్చిందని తెలిపారు.
ఇక తనపై వస్తున్న ట్రోల్స్ పైనా థమన్ స్పందించారు. ట్రోల్స్ మొదటి నుంచి ఉన్నవేగా అన్నారు. వాటి గురించి ఆలోచిస్తే ముందుకు వెళ్లలేమన్నారు. కానీ తన తప్పుంటే ముందే ఒప్పేసుకుంటానని, అలాందేమీ లేనప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం లేదనట్టుగా కామెంట్స్ చేశారు. ఇక స్టార్ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ప్రొడక్షన్ లో అవకాశం ఇస్తే మాత్రం ఫ్రీగా మ్యూజిక్ అందిస్తానని చెప్పారు. ఎందుకంటే ధోనీ అంటే అంత ఇష్టమని, తనకు పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటి వరకు వారి దగ్గరి నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదన్నారు.
ఇదిలా ఉంటే.. ‘గుంటూరు కారం’ చిత్రం నుంచి థమన్ తప్పుకున్నాడంటూ మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. దీనిపైనా స్పందించారు. ఈ చిత్రం ప్రస్తుతం మ్యూజిక్ సెట్టింగ్‌లు జరుగుతున్నాయని, రిజల్ట్ చాలా ఆకట్టుకునేలా ఉంటుందన్నారు. ఫ్యాన్స్ కు పూర్తి ప్యాకేజీని అందించేలా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. త్వరలో మిగిలిని అప్డేట్స్ వస్తాయని చెప్పుకొచ్చారు.