
ఒకప్పుడు లేడీ అమితాబ్ గా , ఫైర్ బ్రాండ్ గా వెలిగిన విజయశాంతి రీ ఎంట్రీ కోసం చాలా మంది ప్రయత్నాలు చేసారు. కానీ ఆమె ఇష్టపడలేదు,రాజకీయాల్లో కంటిన్యూ అవుతూ.. ఎవరికీ ఆమె డేట్స్ ఇవ్వలేదు. కానీ దర్శకుడు అనీల్ రావిపూడి పట్టుదలతో ఆమె మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోవటానికి ఆమె ను ఒప్పించటానికి దర్శక,నిర్మాతలు చాలా ప్రయాసపడ్డారని చెప్పుకున్నారు.
ఈ సినిమా జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. కాగా, ఇందులో నటించేందుకు విజయశాంతి కోటిన్నర డిమాండ్ చేసిందని... ఆ మొత్తాన్ని ఇచ్చేనందుకు నిర్మాతలు ఓకే అన్నారని తెలుస్తోంది.
విజయశాంతి హీరోయిన్ గా చేస్తున్న సమయంలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ ముందుకు వెల్తోంది. ఈ సినిమా తరువాత లేడీ సూపర్ స్టార్ అనేక సినిమాలు చేసింది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత సినిమాలు ఆపేసింది. ఇన్నాళ్లకు తిరిగి వెండితెరపై కనిపించబోతూండటంతో మంచి క్రేజ్ వస్తోంది. సినిమాలో కీలకమైన పాత్ర అని, హీరోకు తల్లి పాత్ర కాకపోయినా...కొంచెం అటూ ఇటూలో అలాంటిదే అంటున్నారు.