ఖరారు: బోయపాటి కన్నా ముందే వేరే డైరక్టర్ తో బాలయ్య

By AN TeluguFirst Published Apr 26, 2019, 9:25 AM IST
Highlights

బాలయ్యలో ఓ గొప్ప లక్షణం ఉందని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. 

బాలయ్యలో ఓ గొప్ప లక్షణం ఉందని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. ఎప్పుడూ ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు. పార్టీలు, ఫ్రెండ్స్ అంటూ రోజులను వృధాగా కాలక్షేపం చేయరు. మిగతా హీరోలు లాగ పబ్ లను మరొకటి తిరగరు. దాంతో ఉంటే షూటింగ్ లో లేదా తన ఫ్యామిలీతో అన్నట్లుగా లైఫ్ లీడ్ చేస్తారు. మొన్నటి దాకా ఎలక్షన్ క్యాంపైన్ లో  హడావిడి గా  గడిపిన కాస్త రిలాక్స్ అయ్యారు. షూటింగ్ లకు రెడీ అయ్యారు. అయితే ఏ డైరక్టర్ తో సినిమా చేస్తారు. అందురూ అనుకున్నట్లుగానే  బోయపాటితో..

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందే ఆ చిత్రం పూర్తి స్క్రిప్టు పూర్తయ్యాకే ప్రారంభించాలని ఫిక్స్ అయ్యారు. దాంతో మరో నాలుగైదు నెలలు గ్యాప్ వచ్చేటట్లు ఉంది. ఈ  నేఫధ్యంలో బాలయ్య..ఖాళీగా ఉండటం ఎందుకని వేరే డైరక్టర్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రారంభించటానికి రెడీ అవుతున్నారు. ఆ దర్శకుడు మరెవరో కాదు కె.ఎస్ రవికుమార్. 

కెఎస్ రవికుమార్ వర్కింగ్ స్టైల్, విజన్ నచ్చి ఆయనతో మరోసారి సినిమా చేయటానికి ముందుకు వచ్చారు బాలకృష్ణ.గతేడాది వీరిద్దరూ కలిసి 'జైసింహ' చేశారు.  ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.  రవికుమార్ స్టైల్ నచ్చిన బాలయ్య ఆయనతో ఇంకోసారి పనిచేసేందుకు ఒప్పుకున్నారు.  ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మించనున్నారు.    ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం అయ్యి, ఆగస్ట్ లో  పూర్తి కానుంది. అక్టోబర్ లో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత బోయపాటితో చేయబోయే చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ లోగా బోయపాటి స్క్రిప్టు పూర్తి చేస్తారు. 

click me!