టాలీవుడ్‌లో విషాదం.. విజయ నిర్మల సోదరుడు కన్నుమూత..

Published : Jan 14, 2024, 07:06 PM ISTUpdated : Jan 14, 2024, 07:12 PM IST
టాలీవుడ్‌లో విషాదం.. విజయ నిర్మల సోదరుడు కన్నుమూత..

సారాంశం

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు  చేసుకుంది. దివంగత దర్శకురాలు, నిర్మాత,  నటి విజయ నిర్మల సోదరుడు  కన్నుమూశారు. 

సంక్రాంతి పండగ వేళ టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. దివంగత దర్శకురాలు విజయ నిర్మల సోదరుడు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన ఆదివారం తుది శ్వాస విడిచారు. విజయ నిర్మల సోదరుడు ఎస్‌ రవికుమార్‌.. వయోభారంతో ఈ ఉదయం కన్నుమూశారు. విజయ నిర్మలకు ఆయన స్వయాన సోదరుడు కావడం విశేషం. ఇక సీనియర్‌ నటుడు నరేష్‌కి ఆయన మేన మామ అవుతాడు. 

విజయ నిర్మల నటిగా, దర్శకురాలిగా బిజీగా ఉన్న  సమయంలో ఆమెకి అండగా ఉన్నారు రవికుమార్‌. అన్ని విషయాల్లో ఆమెకి సపోర్ట్ గా నిలిచారు. అంతేకాదు విజయకృష్ణ మూవీస్‌ ని ఆయనే నిర్వహించారు. ప్రొడక్షన్‌ పరంగా అన్నీ తానై వ్యవహరించారు. విజయ్‌ నిర్మల  యాక్టివ్‌  ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. కానీ ఆమె మరణంతో ఆయన పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యారు. రవికుమార్‌ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. 

విజయ నిర్మల 44 సినిమాలకు దర్శకత్వం వహించిన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులోకి ఎక్కింది. ఓ లేడీ దర్శకురాలు ఇన్ని సినిమాలకు దర్శకత్వం వహించడం ఇదే రికార్డు. అందుకే ఆమె అరుదైన ఘనతని సాధించింది. సూపర్‌ కృష్ణతోనే అత్యధిక మూవీస్‌ చేసింది. నటిగా, దర్శకురాలిగా ఆయనతోనే ఎక్కువ మూవీస్‌ చేసింది. ఇక అనారోగ్యం కారణంగా ఆమె 2019లో కన్నుమూశారు. 2022 నవంబర్‌లో కృష్ణ సైతం కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు