ప్రభాస్‌, మారుతి సినిమాకి డిజిటల్‌ కటౌట్‌.. కొత్త ట్రెండ్‌కి శ్రీకారం..

Published : Jan 14, 2024, 03:32 PM IST
ప్రభాస్‌, మారుతి సినిమాకి డిజిటల్‌ కటౌట్‌.. కొత్త ట్రెండ్‌కి శ్రీకారం..

సారాంశం

ప్రభాస్‌ ప్రస్తుతం మారుతితో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని సంక్రాంతి సందర్భంగా విడుదల చేయబోతున్నారు. అయితే డిజిటల్‌ కటౌట్‌ని విడుదల చేస్తుండటం విశేషం. 

ప్రభాస్‌ ఇటీవల `సలార్‌`తో బాక్సాఫీసుని షేక్‌ చేశారు. ఆయన ఈ మూవీ ఏడువందల కోట్లు వసూలు చేసింది. సంక్రాంతి సినిమాల రాకతో సైలెంట్‌ అయ్యింది. ఇప్పుడు మరో సినిమాతో సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వకుండా సీక్రెట్‌గా మెయింటేన్‌ చేసిన మారుతి సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చింది యూనిట్‌. సంక్రాంతికి సందడి షురూ చేయబోతుంది. ఈ మూవీ నుంచి టైటిల్‌ ఫస్ట్ లుక్‌ని విడుదల చేయబోతుంది. 

మారుతితో చేసే ప్రభాస్‌ మూవీ టైటిల్‌ ఫస్ట్ లుక్‌ని సంక్రాంతి కానుకగా ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేస్తుంది. రేపు గ్రాండ్‌గా ఈ టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేయబోతుంది. అయితే దీన్నొక కటౌట్‌ మాదిరిగా లాంఛ్‌ చేయడం విశేషం. డిజిటల్‌ కటౌట్‌ని లాంఛ్‌ చేయబోతున్నట్టు టీమ్‌ తెలిపింది. భీమవరంలో దీన్ని ప్లాన్‌ చేయడం విశేషం. 

జనవరి 15, ఉదయం 6:30 గంటలకి వెంప కాసి కోడి పందెం బరి పెడమెరం, భీమవరం లో ఈ డిజిటల్‌ కటౌట్‌ని లాంఛ్‌ చేస్తామని టీమ్‌ అధికారికంగా ప్రకటించింది. మొదటి సారి గా ఒక డిజిటల్ కటౌట్ ను లాంఛ్ చేయడం, అది కూడా ప్రభాస్ మూవీ కి కావడం తో ఫ్యాన్స్ ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టబోతుందని చెప్పొచ్చు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను భారీగా ప్లాన్‌ చేశారట. అదే సమయంలో వినూత్నంగా ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఓ ప్రాపర్‌ ప్లాన్‌ ప్రకారం దీన్ని ప్రమోట్‌ చేయబోతున్నట్టు టీమ్ ఇప్పటికే తెలిపింది. దాన్ని ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు. 

ఓ వైపు ప్రభాస్‌ నటించిన `కల్కి`చిత్రాన్ని ఇంటర్నేషనల్‌ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నారు. అన్నీ సిటీస్‌లో ఒకేసారి లాంఛింగ్‌ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ప్రమోషన్స్ ఈవెంట్స్ లో ఇది నెక్ట్స్ లెవల్‌ చూపిస్తున్నారు. దీంతో మారుతి సినిమా మేకర్స్ సైతం దీన్ని గ్రాండ్‌గానే ప్లాన్‌ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో మాళవిక మోహనన్‌ తోపాటు నిధి అగర్వాల్‌, రిధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారట. హర్రర్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే