దీనిని ప్రేమ అంటారా.. కుట్ర అంటారా.. నయనతార దెబ్బకు డైరెక్టర్ బలి, భర్త కోసం ?

Published : Feb 28, 2023, 12:58 PM IST
దీనిని ప్రేమ అంటారా.. కుట్ర అంటారా.. నయనతార దెబ్బకు డైరెక్టర్ బలి, భర్త కోసం ?

సారాంశం

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది.

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గత ఏడాది తన ప్రియుడు విగ్నేష్ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నయనతార.. సరోగసి విధానం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లి కూడా అయింది. నయనతార సరోగసి ఎంచుకోవడం పై పెద్ద వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. కానీ నయన్ కి విలాంటి వివాదాలు పెద్ద సమస్య కాదు. ఆ వివాదాన్ని సద్దుమణిగేలా చేసింది. 

అయితే ఇటీవల నయన్ భర్త విగ్నేష్ శివన్ కి చుక్కెదురైన సంగతి తెలిసిందే. తమిళ స్టార్ హీరో అజిత్ తో విగ్నేష్ శివన్ చిత్రానికి అంతా సిద్ధం అయింది. ఇక సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అనుకున్న తరుణంలో.. కథ నచ్చలేదని అజిత్, లైకా సంస్థ ఇద్దరూ రిజెక్ట్ చేశారు. తన భర్త కోసం నయనతార రాయబారం సాగించినా అజిత్ వినలేదని ప్రచారం జరిగింది. 

విగ్నేష్ చాలా కాలంగా ఈ కథపై వర్క్ చేస్తున్నాడు. కానీ చివరి దశలో అజిత్ రిజెక్ట్ చేయడంతో విగ్నేష్ జీర్ణించుకోలేకపోయాడట. పెళ్లి తర్వాత విగ్నేష్ చేస్తున్న భారీ చిత్రం కావడంతో నయనతారకి కూడా అవమానంగా అనిపించింది అని తమిళ వర్గాలు చెబుతున్నాయి. అజిత్ తో తనకి ఉన్న సంబంధాలతో ఈ ప్రాజెక్టుని ఎలాగైనా పట్టాలెక్కించాలని నయన్ ప్రయత్నించింది. కానీ అజిత్ ససేమిరా అనడంతో నయనతార అవమానంగా భావించిందట. 

దీనితో తన భర్త కోసం ఎంతదూరం అయినా వెళ్లేందుకు నయన్ రెడీ అయినట్లు తెలుస్తోంది. అజిత్ రిజెక్ట్ చేసిన కథతోనే విగ్నేష్ మరో హీరోతో మూవీ చేసేలా వ్యూహాలు రచిస్తోందట. రచించడమే కాదు అమలు చేయడం కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. తన భర్త కోసం విలక్షణ నటుడు విజయ్ సేతుపతికి గాలం వేస్తోంది అని అంటున్నారు. 

విజయ్ సేతుపతి తన తదుపరి చిత్రంగా సుందర్ సి దర్శకత్వంలో నటించాల్సి ఉంది. కథా చర్చలు కూడా జరిగాయి. అరణ్మణై 4కి గాను సుందర్ సి , విజయ్ సేతుపతి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కానీ మధ్యలో నయన్ దూరి ఈ ప్రాజెక్టు ఆగిపోయేలా చేసిందట. విజయ్ సేతుపతితో ఈ కథ నచ్చలేదని సుందర్ సికి చెప్పించినట్లు తమిళ వర్గాలు కోడై కూస్తున్నాయి. తద్వారా విజయ్ ని తన భర్త ప్రాజెక్టులోకి తీసుకురాబోతున్నట్లు చెబుతున్నారు. తన భర్తపై ప్రేమ ఉండడం మంచిదే కానీ.. భర్త కోసం మరో దర్శకుడిని ఇలా బలిచేయడం కరెక్ట్ కాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌