Vijay Sethupathi Role in Pushpa 2: పుష్ప 2లో విజయ్ సేతుపతి విలన్ కాదట.. మరి ఎవరంటే!

Published : Jul 05, 2022, 12:13 PM ISTUpdated : Jul 05, 2022, 12:14 PM IST
Vijay Sethupathi Role in Pushpa 2: పుష్ప 2లో విజయ్ సేతుపతి విలన్ కాదట.. మరి ఎవరంటే!

సారాంశం

పుష్ప 2 భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. క్యాస్టింగ్ విషయంలో కూడా అసలు తగ్గడం లేదు. ఫ్యాన్సీ రెమ్యూనరేషన్ ఇచ్చి విజయ్ సేతుపతిని తీసుకోవడం జరిగింది. కాగా పుష్ప సీక్వెల్ లో విజయ్ సేతుపతి రోల్ పై సమాచారం అందుతుంది.   

అల్లు అర్జున్ (Allu Arjun)కి పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చిపెట్టింది పుష్ప. దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఇక పుష్పలో ఆయన మేనరిజం, తగ్గేదేలే డైలాగ్ ఫుల్ ఫేమస్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్ నుండి క్రికెటర్స్ వరకు పుష్ప తగ్గేదెలే మేనరిజం అనుకరించారు. హిందీలో పుష్ప విజయం సాధించడమే దీనికి కారణం. పుష్ప హిందీ వర్షన్ వంద కోట్ల వసూళ్లతో దుమ్ముదులిపింది. అర్జున్ అర్జున్ కి అద్భుత విజయాన్ని అందించింది. 

వరల్డ్ వైడ్ గా పుష్ప(Pushpa) రూ. 360 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం విశేషం. ఈ క్రమంలో పుష్ప పార్ట్ 2 భారీ ఎత్తున నిర్మించనున్నారు. సీక్వెల్ బడ్జెట్ కూడా డబుల్ చేసినట్లు సమాచారం. పుష్ప 2 తో రికార్డు వసూళ్లపై మేకర్స్ కన్నేశారు. కెజిఎఫ్, ఆర్ ఆర్ ఆర్ మాదిరి వెయ్యి కోట్లు కొల్లగొట్టాలని చూస్తున్నారు. దీని కోసం స్క్రిప్ట్ నుండి అనేక మార్పులు చేస్తున్నారు. సెట్స్ పైకి వెళ్లాల్సిన మూవీ అందుకే ఆలస్యమవుతుంది. 

ఇక పుష్ప సీక్వెల్ కోసం విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఆయనకు భారీ రెమ్యునరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ కి సైన్ చేయించారట. మరి పుష్పలో విజయ్ సేతుపతి(Vijay Sethupathi) రోల్ ఏమిటీ? అనే ఆసక్తి నెలకొని ఉంది. దీనిపై విశ్వసనీయ సమాచారం అందుతుంది. అల్లు అర్జున్ స్నేహితుడిగా విజయ్ సేతుపతి రోల్ ఉంటుందట. ఆయనది విలన్ రోల్ కాదట. ఫహద్ ఫాజిల్ తో పాటు మరికొందరు విలన్స్ గా కనిపిస్తారట. 

ఇక ఆగస్టు నుండి పుష్ప సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తున్నారు. అనసూయ, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. పుష్ప 2024లో విడుదలయ్యే సూచనలు కలవు. పుష్ప సిరీస్ కి దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nagarjuna: కోడలు శోభితా ప్రెగ్నెన్సీపై నాగార్జున రియాక్షన్‌ ఇదే, తాత కావడంపై హింట్‌.. రూ.2కోట్ల విరాళం
Karthika Deepam 2 Today Episode: వైరాతో చేతులు కలిపిన జ్యోత్స్న- శ్రీధర్ ని కార్తీక్ కాపాడుతాడా?