సర్కార్: షాకింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్.. టార్గెట్ 200కోట్లు?

By Prashanth M  |  First Published Oct 26, 2018, 3:28 PM IST

సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేస్తున్నారు స్టార్ హీరోలు. 100 కోట్లను అందుకోవడం అంటే ఇప్పుడు పెద్ద కష్టం కాదు. మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్న హీరోల పై 50కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేస్తున్నాయి.


సౌత్ సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి బాక్స్ ఆఫీస్ లెక్కలను మార్చేస్తున్నారు స్టార్ హీరోలు. 100 కోట్లను అందుకోవడం అంటే ఇప్పుడు పెద్ద కష్టం కాదు. మార్కెట్ స్ట్రాంగ్ గా ఉన్న హీరోల పై 50కోట్లు ఇన్వెస్ట్ చేస్తే ఈజీగా 100కోట్ల గ్రాస్ కలెక్షన్స్ దాటేస్తున్నాయి. ఇకపోతే వచ్చే ఇప్పుడు ఇళయదళపతి విజయ్ సర్కార్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. 

మురగదాస్ దర్శకత్వంలో సినిమా రూపొందడం ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ - కత్తి సినిమాలు సక్సెస్ అందుకోవడంతో ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండే అవకాశం ఉంది. సర్కార్ సినిమా పాలిటిక్స్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ అండ్ ఎమోషన్ ఫిల్మ్. దాదాపు  100కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించారు. 

Latest Videos

undefined

ఇప్పటికే తమిళనాడులో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పనులు ఎండ్ అయ్యాయి. 83.50 కోట్ల బిజినెస్ చేసిన సర్కార్ మొదటి వారంలోనే కలెక్షన్స్ ను గట్టిగా అందుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. విజయ్ చివరి సినిమా మెర్సల్ మొత్తంగా తెలుగు తమిళ్ లో 244కోట్ల గ్రాస్ ను అందుకుంది. 

ఇక ఇప్పుడు సర్కార్ అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ ను అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొదలైతే సర్కార్ టీమ్ 200కోట్లను అందుకోవాలని టార్గెట్ గా పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 6న దీపావళి సందర్బంగా సినిమా రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఏఆర్.రెహమాన్ సంగీతం అందించారు. 

click me!