ఫ్లాప్ కాంబో.. ఆ నలుగురికి హిట్ కావాలి!

Published : Jun 19, 2019, 01:04 PM IST
ఫ్లాప్ కాంబో.. ఆ నలుగురికి హిట్ కావాలి!

సారాంశం

  ఎలాగైనా హిట్ అందుకోవాలని ఓ కొత్త సినిమాతో నలుగురు ముందడుగు వేశారు. హీరో  రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా అలాగే నిర్మాత కేకే.రాధామోహన్ - అనూప్ రూబెన్స్.. వీరంతా గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్నారు.

ఎలాగైనా హిట్ అందుకోవాలని ఓ కొత్త సినిమాతో నలుగురు ముందడుగు వేశారు. హీరో  రాజ్ తరుణ్ - డైరెక్టర్ విజయ్ కుమార్ కొండా అలాగే నిర్మాత కేకే.రాధామోహన్ - అనూప్ రూబెన్స్.. వీరంతా గత కొంత కాలంగా అపజయాలతో సతమతమవుతున్నారు. ఎలాగైనా మంచి హిట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఇప్పుడు కలిసి అడుగేస్తున్నారు. 

నేడు ఆ కొత్త సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి ఆడియెన్స్ కి అందించాలని షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. రాజ్ తరుణ్ కుమారి 21F తరువాత ఆ స్థాయిలో మరో హిట్ అందుకోలేదు. ఇక నిర్మాత రాధామోహన్ బెంగాల్ టైగర్ - మీలో ఎవరు కోటీశ్వరుడు -పంతం వంటి సినిమాలతో అపజయాలను అందుకున్నారు.

దర్శకుడు విజయ్ కుమార్ కొండ గుండెజారి గల్లంతయ్యిందే సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నప్పటికీ ఆ తరువాత ఒక లైలా కోసం అనే సినిమాతో ఫ్లాప్ అందుకున్నాడు. మరో సినిమా తెరకెక్కించాలని గత కొంత కాలంగా ఎదురుచూస్తున్న ఈ దర్శకుడికి ఇప్పుడు మంచి అవకాశం దొరికింది. అలాగే సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ కెరీర్ లో మరోసారి డీలా పడ్డాడు. సక్సెస్ లు లేక అవకాశాలు తగ్గాయి. ఇక ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమా కోసం పని చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఈ నలుగురికి ఎంతవరకు హిట్టొస్తుందో చూడాలి.  

PREV
click me!

Recommended Stories

850 కోట్లతో యానిమల్‌ కు షాక్ ఇచ్చిన ధురందర్, ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం
1300 కోట్లతో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచిన హీరోయిన్ ఎవరు? 2025 లో టాప్ 5 స్టార్స్ కలెక్షన్లు