
దళపతి విజయ్ ఎన్నికల్లోకి వెళ్లేముందు చివరగా నటిస్తున్న చిత్రం `జన నాయగన్`(జన నాయకుడు). హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. ఇందులో పూజా హెగ్డే, మమితా బైజు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కే నారాయణ, జగదీష్ పళనిస్వామి, లోహిత్ ఎన్ కే నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఓ వైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే ఈ మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు విజయ్.
విజయ్ షెడ్యూల్‌ని బట్టి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు వినోద్. విజయ్ నటిస్తోన్న చివరి మూవీ కావడంతో చాలా భారీగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో చాలా కేర్ తీసుకుని, బలమైన కంటెంట్‌తో `జన నాయగన్` చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
ఎలాగైనా హిట్ కొట్టాలి, అది విజయ్‌కి హైప్ ఇవ్వడంతోపాటు జనాల్లో క్రేజ్‌ని తీసుకురావాలని చెప్పి, ఆ తరహాలోనే బలమైన సామాజిక ఎలిమెంట్లని జోడిస్తూ రూపొందిస్తున్నారట.
ఇదిలా ఉంటే తన అభిమానులకు ట్రీట్ రెడీ చేస్తున్నారు విజయ్. విజయ్ ఫ్యాన్స్ కి టీమ్ అదిరిపోయే సర్‌ప్రైజ్ రెడీ చేస్తున్నారు. `జన నాయగన్` నుంచి గ్లింప్స్ విడుదల చేయబోతున్నారు.
ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్, ఆ తర్వాత పలు డిఫరెంట్ పోస్టర్స్ విడుదల చేశారు. అవి సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఇప్పుడు అదిరిపోయే ట్రీట్‌ని ప్లాన్ చేస్తున్నారట. ఈ నెల 22న(జూన్ 22న) విజయ్ పుట్టిన రోజు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని `జన నాయగన్` మూవీ నుంచి `రోర్` పేరుతో గ్లింప్స్ నిగానీ, టీజర్ ని గానీ విడుదల చేయబోతున్నారని సమాచారం. ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చేలా ఈ టీజర్ ఉంటుందట. మరి అది ఏ రేంజ్‌లో ఆకట్టుకుంటుందో చూడాలి.
ఇక `జన నాయగన్` తెలుగులో వచ్చిన `భగవంత్ కేసరి` మూవీకి రీమేక్ అనే ప్రచారం జరిగింది. సినిమాలోని మెయిన్ పాయింట్‌ని తీసుకుని రూపొందిస్తున్నారని అన్నారు. కానీ అది నిజం కాదని తెలుస్తుంది.
పూర్తిగా కొత్త కథతోనే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని టాక్. మరి ఏది నిజమో త్వరలోనే రాబోతున్న టీజర్ ద్వారా తెలుస్తుంది. రేపు శనివారం అర్థరాత్రి 12 గంటలకు `కుబేర ట్ర ఈ చిత్రాన్నివచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
విజయ్ యాభై ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఆదివారంతో ఆయన 51లోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో ఈ బర్త్ డే ఆయనకు చాలా స్పెషల్‌గా నిలవబోతుంది. పైగా రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈ పుట్టిన రోజు చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని తెలుస్తోంది.
ఇక ధనుష్ గతేడాది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. `తమిలాగ వెట్రి కజగమ్`(టీవీకే) పేరుతో ఈ రాజకీయ పార్టీని స్థాపించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన సన్నాహాలు చేస్తున్నారు.