ఫ్యాన్స్ మధ్య గొడవలు మంచిదే.. గేమ్స్ రాజకీయాల్లో ఆడుకోండి!

By tirumala ANFirst Published Sep 20, 2019, 4:33 PM IST
Highlights

సెన్సేషనల్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బిగిల్. తనకు అచ్చొచ్చిన డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో మరోసారి విజయ్ నటిస్తున్న చిత్రం ఇది. వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. తేరి, మెర్సల్ చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన బిగిల్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో విజయ్ డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు. ఇండియాలో క్రీడారంగంలో జరుగుతున్న అవినీతి, రాజకీయాలపై అస్త్రం సంధించే విధంగా ఈ చిత్రం ఉండబోతోంది. తాజాగా ఈ చిత్ర ఆడియో లాంచ్ చెన్నైలో జరిగింది. 

ఆడియో వేడుకలో విజయ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సాధారణంగా మీడియా ముందుకు చాలా తక్కువగా వచ్చే విజయ్ ఆడియో వేడుక ద్వారా అభిమానులతో ముచ్చటించే అవకాశం కలిగింది. దీనితో విజయ్ అన్ని విషయాలని టచ్ చేస్తూ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. 

తన సినిమాలకు బ్యానర్లు, కటౌట్లు పెట్టవద్దని విజయ్ మరోమారు అభిమానులని రిక్వస్ట్ చేశాడు. ఇటీవల చెన్నైలో ఓ హోర్డింగ్ కూలడం వల్ల శుభశ్రీ అనే యువతి మరణించింది. దీనితో శుభశ్రీ సంఘటన గురించి మాట్లాడుతూ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయవద్దని కోరాడు. 

సోషల్ మీడియాలో అభిమానుల మధ్య జరిగే ఫ్యాన్ వార్స్ గురించి కూడా విజయ్ స్పందించాడు. అజిత్, విజయ్ అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తరచుగా తీవ్రమైన ట్రోలింగ్ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీని గురించి మాట్లాడుతూ.. అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ మంచిదే. ఆ గొడవలు సరదాగా ఉంటాయి. కానీ హద్దులు దాటకుండా చూసుకోండి అని విజయ్ అభిమానులకు సూచించాడు. 

ఆన్లైన్ లో గొడవల వల్ల మరొకరిని కించపరచుకుండా, ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి చాలు అని విజయ్ అభిమానులకు సూచించాడు. బిగిల్ చిత్రం గురించి మాట్లాడుతూ.. క్రీడా రంగంలో రాజకీయ నాయకుల గేమ్స్ ఎక్కువవుతున్నాయి.. రాజకీయాల్లో మీ గేమ్స్ మీరు ఆడుకోండి. క్రీడా రంగాన్ని నాశనం చేయొద్దు అని విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రంలో విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా కనిపించబోతున్నాడు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. 

click me!