అట్లీ సినిమా కోసం విజయ్ కొత్త లుక్!

Published : Dec 08, 2018, 01:51 PM IST
అట్లీ సినిమా కోసం విజయ్ కొత్త లుక్!

సారాంశం

తమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇటీవల 'సర్కార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్. 

తమిళ స్టార్ హీరో విజయ్ కి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇక్కడ కూడా ఆయన సినిమాలు మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇటీవల 'సర్కార్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్.

ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని అదే రేంజ్ లో వసూళ్లను కూడా రాబట్టింది. ఇప్పుడు విజయ్ తనకు 'తేరి', 'మెర్సల్' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను ఇచ్చిన దర్శకుడు అట్లీతో మరో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. 

ప్రస్తుతం ఈ సినిమా సెట్ వర్క్ జరుగుతోంది. భారీ బడ్జెట్ తో ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. క్రీడా నేపధ్యంలో సాగనున్న ఈ సినిమాలో విజయ్ కోచ్ పాత్రలో కనిపించబోతున్నాడు. దీనికోసం తన శరీరాకృతిని మార్చుకునే పనిలో పడ్డాడు.

మిగతా హీరోలతో పోలిస్తే తన లుక్, ఫిట్ నెస్ విషయంలో విజయ్ చాలా కేర్ తీసుకుంటాడు. ఈ సినిమాలో కొత్త లుక్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్చేయబోతున్నాడు. హీరో సూర్య పర్సనల్ ట్రైనర్ విజయ్ కి శిక్షణ  ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది!

PREV
click me!

Recommended Stories

హీరోలంతా లైన్‌ వేయడానికే అప్రోచ్‌ అవుతారని ఏకంగా స్టార్‌ హీరోని అవాయిడ్‌ చేసిన అనసూయ
జైలర్ 2 లో తమన్నాకి నో ఛాన్స్.. రజినీకాంత్ తో ఐటెం సాంగ్ లో స్టెప్పులేయబోతున్న బ్యూటీ ఎవరో తెలుసా ?