అమ్మాయిలకు అదాశర్మ స్వీట్ వార్నింగ్!

By AN TeluguFirst Published Jun 21, 2019, 2:37 PM IST
Highlights

'హార్ట్ ఎటాక్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ అదాశర్మ. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు రాలేదు.

'హార్ట్ ఎటాక్' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ అదాశర్మ. తెలుగులో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకి సరైన గుర్తింపు రాలేదు. సినిమాలలో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తుంటుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్ కోసం సిద్ధమవుతోంది. 'ది హాలిడే' అనే పేరుతో రూపొందించనున్న ఈ సిరీస్ కోసం అదాశర్మ సరికొత్త హెయిర్ స్టైల్ ని ట్రై చేసింది. తన జుట్టుకి మూడు రకాల రంగులతో డై వేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ హెయిర్ స్టైల్అదాశర్మకి మంచి క్రేజ్ తీసుకొచ్చింది. దాంతో ఆమె ఆ హెయిర్ స్టైల్ కాపీ రైట్స్ తనవేనంటూ సరదాగా పోస్ట్ చేసింది.

తాను 'ది హాలిడే' సిరీస్ కోసం చేసుకున్న హెయిర్ స్టైల్ అని, అమ్మాయిలూ దీన్ని ట్రై చేయకూడదని.. ఈ హెయిర్ స్టైల్ పై పూర్తి కాపీ రైట్స్ తనవేనంటూ సోషల్ మీడియాలో అమ్మాయిలకు స్వీట్ గా వార్నింగ్ ఇచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ తోనైనా అదా సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం!

click me!