‘ఖుషి’ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది.. ఏరోజంటే? అఫీషియల్

Published : Jul 24, 2023, 06:10 PM IST
‘ఖుషి’ నుంచి మోస్ట్ అవైటెడ్ టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది.. ఏరోజంటే? అఫీషియల్

సారాంశం

‘ఖుషి’ సాంగ్స్  సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని టైటిల్ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ తో పాటు ఆడియెన్స్  ఎదురుచూస్తున్నారు. తాజాగా మేకర్స్  ఆ మోస్ట్ అవైటెడ్ టైటిల్ సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.   

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) - స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  జంటగా ‘మహానటి’ చిత్రంలో అలరించిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ‘ఖుషి’తో ఫుల్ లెన్త్ రోల్ లో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఇటు సమంత, అటు విజయ్ దేవరకొండ ఈ సినిమా హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో కొనసాగుతున్నాయి. అయితే ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ‘నా రోజా నువ్వే’, ‘ఆరాధ్య’ పాటలు సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. సంగీత ప్రియులకు, యువతను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికీ యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రాం రీల్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఖుషి నుంచి మూడో పాట రానుంది. ‘ఖుషి’ అంటూ సాగే ఈ పాటను జూలై 28న రిలీజ్ చేయతోన్నారు.

‘ఖుషి’ టైటిల్ సాంగ్ కోసం మ్యూజిక్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన సాంగ్స్ ఇప్పటికే యువతను ఎంతలా ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇక Kushi Title Song కూడా ట్రెండ్ అవుతుందని భావిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ ఫుల్ సాంగ్ విడుదల కానుంది. జూలై 28న ఖుషి టైటిల్ సాంగ్ మరోసారి సోషల్ మీడియాను షేక్ చేయనుంది.

ఈ టైటిల్ సాంగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగినట్టు.. అలా గాల్లో తేలిపోతోన్న విజయ్ దేవరకొండ పోస్టర్ ఎంతో కూల్‌గా ఉంది.  ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోన్నారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తుండగా...  జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?