విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు షాక్.. ‘ఫ్యామిలీ స్టార్’ సంక్రాంతికి రావట్లేదా? ఆ డేట్లను పరిశీలిస్తున్న టీమ్!

By Asianet NewsFirst Published Nov 27, 2023, 1:57 PM IST
Highlights

విజయ్ దేవరకొండ త్వరలో ‘ఫ్యామిలీ స్టార్’ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని తొలుత ప్రకటించారు. కానీ ప్రస్తుతం డేట్ ను వాయిదా వేస్తున్నారని.. ఆ రెండు డేట్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 

డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)   ప్రస్తుతం జోష్ మీద ఉన్నారు. ప్రతి సినిమాను ఇకపై సక్సెస్ బాటలోనే నడిపించాలని ప్రయత్నిస్తున్నారు. అందుకోసం సినిమాల రిలీజ్ విషయంలో ఆచీతూచి అడుగేస్తున్నారు. రీసెంట్ గా ‘ఖుషి’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఆడియెన్స్ నుంచైతే మంచి రెస్పాన్స్ ను దక్కించుకున్నారు. ఈ క్రమంలో త్వరలో మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో రాబోతున్నారు. 

రౌడీ హీరో మధ్య తరగతి వ్యక్తి జీవనశైలిని వెండితెరపై ప్రతిబింబించబోతున్నారు. మిడిల్ క్లాస్ పర్సన్ రౌడీగా మారితే సీన్ ఎలా ఉంటుందో కూడా చూపించబోతున్నారు. ఆ చిత్రమే Family Star.  విజయ్ ఫేవరెట్ డైరెక్టర్ పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. వెంటవెంటనే అప్డేట్స్ అందించారు. 

ఈ క్రమంలో ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి కూడా టీజర్, పోస్టర్లు రిలీజై ఆకట్టుకున్నాయి. ఇక సినిమానూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు గతంలోనే ప్రకటించారు. కానీ తాజాగా ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు తెలుస్తోంది. సినిమాను మరో రెండు మూడు నెలలు వాయిదా వేయాలని చూస్తున్నారంట. సంక్రాంతికి ఇప్పటికే సినిమాలు కాచుకొని ఉన్నాయి. మరిన్ని యాడ్ కాబోతున్నాయి. ఈ తరుణంలో వేరే డేట్ కోసం చూస్తున్నారని తెలుస్తోంది. 2024 మార్చి 8 లేదంటే మార్చి 22న చిత్రాన్ని విడుదల చేసేందుకు పరిశీలిస్తున్నారని డిస్ట్రిబ్యూషన్ వర్గాల నుంచి నసమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

కెరీర్ లో మళ్లీ హిట్ల పంథా మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ నెక్ట్స్ సినిమాను కూడా ఇటు ఆడియెన్స్, అటు బాక్సాఫీస్ వద్ద మెప్పించాలని చూస్తున్నారు. ఈ క్రమంలో రిలీజ్ విషయంలో కాస్తా ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)  విజయ్ సరసన నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే విజయ్  అటు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడీ12లోనూ నటిస్తున్నారు. మరో రెండు ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నాయి. 

click me!