మరో ఫ్లాప్‌ తప్పించుకున్న వరుణ్‌ తేజ్‌.. పాపం వైష్ణవ్‌ తేజ్‌ బుక్కయ్యాడు..?

Published : Nov 27, 2023, 01:52 PM IST
మరో ఫ్లాప్‌ తప్పించుకున్న వరుణ్‌ తేజ్‌.. పాపం వైష్ణవ్‌ తేజ్‌ బుక్కయ్యాడు..?

సారాంశం

వరుణ్‌ తేజ్‌కి వరుసగా పరాజయాలు వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో ఆయన మరో ఫ్లాప్‌ నుంచి తప్పించుకున్నాడు. దీనికి బదులు వైష్ణవ్‌ తేజ్‌ బలయ్యాడు. 

వైష్ణవ్‌ తేజ్‌ ఇటీవల `ఆదికేశవ` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఆయన నటించిన నాల్గో సినిమా ఇది. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. రొటీన్‌ కమర్షియల్‌ మూవీ కావడంతో ఆడియెన్స్ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. శ్రీలీల కూడా ఉన్నా కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై తెరకెక్కడం గమనార్హం. 

ఈ బ్యానర్‌లో సినిమాలంటే ఇటీవల మినిమమ్‌ గ్యారంటీ అనే నమ్మకం ఆడియెన్స్ లో ఏర్పడింది. కానీ `ఆదికేశవ` ఆ నమ్మకాన్ని బ్రేక్‌ చేసింది. సినిమా రిలీజ్‌ అయ్యాక నాగవంశీ ఇలాంటి సినిమాని ఎలా ఓకే చేశాడనే ప్రశ్నలే ఎక్కువగా వినిపించాయి. మొత్తానికి మిస్టేక్‌ జరిగింది. ఈ ఏడాది వరుస హిట్లతో దూసుకుపోతున్న సితార బ్యానర్‌కి ఈ మూవీ బ్రేకులేసిందని చెప్పొచ్చు. 

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం రివీల్‌ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ మొదట వరుణ్‌ తేజ్‌ వద్దకి వెళ్లిందట. దర్శకుడు వరుణ్‌ తేజ్‌కి నెరేట్‌ చేశాడట. ఆయనతోనే సినిమా చేయాలనుకున్నారు. మొదట ఆల్మోస్ట్ ఓకే అనే దశకు వెళ్లారట. కానీ కారణం ఏంటో గానీ వరుణ్‌ తేజ్‌ మనసు మార్పుకున్నాడట. దీన్ని రిజక్ట్ చేసినట్టు సమాచారం. ఆ తర్వాత వైష్ణవ్‌ తేజ్‌ టెంప్ట్ అయ్యారు. సినిమా చేశాక గానీ ఇది తను చేయాల్సిన మూవీ కాదని ఆయనకు అర్థమై ఉంటుంది. నిర్మాతకు కూడా అర్థమై ఉంటుంది. అందుకే ప్రమోషన్స్ కూడా పెద్దగా యాక్టివ్‌గా చేయలేదు. 

ఏదేమైనప్పటికీ ఇప్పటికే వరుసగా ఫ్లాపుల్లో ఉన్నారు వరుణ్‌ తేజ్‌, మరో ఫ్లాప్‌ నుంచి తెలివిగా తప్పించుకున్నారు. కానీ వైష్ణవ్‌ తేజ్‌ బలయ్యాడు. `ఉప్పెన` చిత్రం తర్వాత వైష్ణవ్‌కి హిట్ లేదు. `కొండపొలం`, `రంగ రంగ వైభవంగా` చిత్రాలు పరాజయం చెందాయి. ఇప్పుడు `ఆదికేశవ`తో మరో డిజాస్టర్‌ పడింది. ఇలా `ఉప్పెన` వంటి హిట్‌ తర్వాత హ్యాట్రిక్‌ ఫ్లాప్‌ని చవిచూశాడు వైష్ణవ్‌. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ `ఆపరేషన్‌ వాలెంటైన్‌` చిత్రంలో నటించారు. ఇది  వచ్చే వారం విడుదల కాబోతుంది.  

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌
Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం