VijayDeverakonda Counter: రష్మిక మందన్నాతో పెళ్లిపై విజయ్‌ దేవరకొండ ట్వీట్‌.. `నాన్సెన్స్ ` అంటూ షాక్‌

Published : Feb 21, 2022, 09:03 PM IST
VijayDeverakonda Counter: రష్మిక మందన్నాతో పెళ్లిపై విజయ్‌ దేవరకొండ ట్వీట్‌.. `నాన్సెన్స్ ` అంటూ షాక్‌

సారాంశం

తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందించారు. ట్వీట్టర్‌ ద్వారా ఈ వార్తలను ఆయన కొట్టపారేశారు. పెళ్లి వార్తలకు చెక్‌ పెట్టారు. ఇది రెగ్యూలర్‌గా జరిగే నాన్సెన్స్ అంటూ ట్వీట్‌ చేశారు. 

రౌడీబాయ్‌ విజయ్‌దేవరకొండ(Vijay Deverakonda), నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా(Rashmika Mandanna) ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మీడియాలోనూ కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. గత కొంత కాలంగా రష్మిక, విజయ్‌ క్లోజ్డ్ గా మూవ్‌ అవుతున్న నేపథ్యంలో వీరిద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే మ్యారేజ్‌ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో తాజాగా Vijay Deverakonda స్పందించారు. ట్వీట్టర్‌ ద్వారా ఈ వార్తలను ఆయన కొట్టపారేశారు. పెళ్లి వార్తలకు చెక్‌ పెట్టారు. ఇది రెగ్యూలర్‌గా జరిగే నాన్సెన్స్ అంటూ ట్వీట్‌ చేశారు. వార్తని ప్రేమించడం లేదా అంటూ ఆయన సెటైర్లు వేశారు. దీంతో రష్మికతో, విజయ్‌ మ్యారేజ్‌ వార్తల్లో నిజం లేదనే విషయాన్ని ఆయన ఈ రూపంలో వెల్లడించారు. ప్రస్తుతం విజయ్‌ రియాక్షన్‌ సైతం వైరల్‌గా మారింది. 

ఇదిలా ఉంటే విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్‌ `గీత గోవిందం` చిత్రంలో కలిసి నటించారు. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ఏకంగా వంద కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాతో విజయ్‌, రష్మిక మధ్య స్నేహం ఏర్పడింది. అంతేకాదు సినిమాలోనూ కెమిస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. ఆ తర్వాత `డియర్‌ కామ్రేడ్‌`లో మరికాస్త ఓపెన్‌ అయ్యారు. ఇందులో ఏకంగా లిప్‌లాక్‌లతోనూ రెచ్చిపోయారు. అయితే ఈ సినిమా నుంచే వీరిద్దరు ప్రేమలో పడ్డారనే టాక్‌ వైరల్‌ అవుతుంది. 

అంతేకాదు విజయ్‌దేవకొండ ఫ్యామిలీకి రష్మిక బాగా దగ్గరయ్యిందని తెలుస్తుంది. అందుకు బలం చేకూరేలా రష్మిక కూడా పలు మార్లు విజయ్ ఇంట్లో కనిపించింది. దీంతోపాటు విజయ్‌, రష్మిక డేట్స్ కి వెళ్లిన ఫోటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఆ మధ్య న్యూఇయర్‌ సందర్భంగా కూడా విజయ్‌తోనే ఎంజాయ్‌ చేసింది రష్మిక. దీంతో వీరిద్దరు డేట్‌లో ఉన్నారనే వార్తకి బలం చేకూరింది. లేటెస్ట్ గా రష్మిక, విజయ్‌ ఇంట్లో వీరి మ్యారేజ్‌కి సంబంధించిన చర్చలు జరిగాయని, అంతా ఓకే చెప్పారని, ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ మ్యారేజ్‌జరగబోతుందనే రూమర్‌ సెన్సేషనల్‌గా మారడంతో తాజాగా విజయ్‌ దేవరకొండ స్పందించి ఆ రూమర్స్ కి చెక్‌పెట్టేశారు. 

ప్రస్తుతం విజయ్‌.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో `లైగర్‌` చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా చిత్రంగా ఇది రూపొందుతుంది. అనన్య పాండే కథానాయికగా నటిస్తుంది. ఇది ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. అనంతరం పూరీ డైరెక్షన్‌లోనే `జనగణమన` చిత్రం చేయబోతున్నారట విజయ్‌. మరోవైపు రష్మిక వరుస సినిమాలతో బిజీగాఉంది. ప్రస్తుతం ఆమె హిందీలో మూడు సినిమాలు చేస్తుంది. తెలుగులో `పుష్ప`తో హిట్‌ అందుకుంది. ఇప్పుడు దీని సీక్వెల్‌లో నటిస్తుంది. అలాగే `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?