
గత ఏడాది వినాయక చవితి రోజున సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. బైక్ నుంచి పడడంతో తేజు గాయాలపాలయ్యాడు. 35 రోజులపాటు సాయి ధరమ్ తేజ్ కు అపోలో వైద్యులు చికిత్స అందించారు. అనంతరం తేజు పూర్తిగా కోలుకున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు.
నేడు సాయిధరమ్ తేజ్ తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడలో కనక దుర్గమ్మని దర్శించుకున్నాడు. ఆలయంలో సాయిధరమ్ తేజ్ తలపాగా, మేడలో కండువాతో సంప్రదాయంగా కనిపించాడు. అర్చకులు సాయిధరమ్ తేజ్ కు వేదమంత్రాలతో ఆశీర్వాదాలు అందించారు.
తేజు, తడి కుటుంబ సభ్యులు భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం తేజు మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది అని.. ఎప్పుడు విజయవాడకు వచ్చినా ప్రశాంతంగా అనిపిస్తుందని తేజు తెలిపాడు. ప్రమాదం తర్వాత తొలిసారి తేజు దుర్గమ్మ తల్లిని దర్శించుకున్నాడు. బహుశా మొక్కు తీర్చుకునేందుకు అయి ఉంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.
గత ఏడాది తేజు తన స్పోర్ట్స్ బైక్ పై వెళుతూ ప్రమాదవశాత్తూ కింద పడ్డాడు. దీనితో తేజుకి తీవ్ర గాయాలయ్యాయి. తేజు హెల్మెట్ ధరించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పింది. అయినప్పటికీ తేజు ఆరోగ్య పరిస్థితిపై మెగా అభిమానుల్లో, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. కానీ తేజు పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నాడు. త్వరలో సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.