‘హీరో’ టైటిల్ తో దేవరకొండ, డైరక్టర్ ఎవరంటే..?

Published : Mar 04, 2019, 09:26 AM IST
‘హీరో’ టైటిల్ తో దేవరకొండ, డైరక్టర్ ఎవరంటే..?

సారాంశం

విజయ్ దేవరకొండ హీరోగా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆయన తమిళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో అక్కడా తన సత్తా చూపించే పనిలో పడ్డారు. 

విజయ్ దేవరకొండ హీరోగా దూసుకుపోతున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా ఆయన తమిళం లోనూ ఫ్యాన్ బేస్ ఏర్పడటంతో అక్కడా తన సత్తా చూపించే పనిలో పడ్డారు  ఈ నేపధ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో‘హీరో’ టైటిల్ తో ఓ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహించే ఈ చిత్రం స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతుంది. ప్రస్తుతం విజయ తో 'డియర్ కామ్రేడ్' చిత్రాన్ని నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుంది.  ఈ సినిమాలో బైక్ రేసర్ గా విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.  బైక్‌ రైడింగ్‌ కోసం ఆల్రెడీ  స్పెషల్‌ ట్రైనింగ్‌ కూడా స్టార్ట్‌ చేశారట విజయ్‌. 

తమిళం చిత్రం ‘కాకముటై’కు డైలాగ్‌ రైటర్‌గా పని చేశారట ఆనంద్‌. ఈ సినిమాలో విజయ్‌కు జోడిగా మాళవిక మోహనన్‌ కనిపిస్తారని టాక్‌. రజనీకాంత్‌ హీరోగా వచ్చిన ‘పేట’ సినిమాలో మాళవిక మోహనన్‌ కీలక పాత్ర చేసిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు తదిదశకు చేరుకున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం.   అలాగే ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఫేమ్‌ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ సినిమాలో కూడా విజయ్‌నే హీరోగా నటిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!