విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

Published : Nov 06, 2018, 04:41 PM ISTUpdated : Nov 06, 2018, 04:42 PM IST
విజయ్ దేవరకొండ హీరోయిన్ మందు కొట్టి సెట్స్ కి వెళ్లేదట!

సారాంశం

నాకు ఆల్కహాల్ అంటే అస్సలు పడదూ.. అంటూనే మందు కొట్టి షూటింగ్ కి వెళ్లిన సంగతులు చెప్పుకొచ్చింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. 'టాక్సీవాలా' సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మందు కొట్టి షూటింగ్ లో పాల్గొన్న సంగతులు గుర్తు చేసుకుంది. 

నాకు ఆల్కహాల్ అంటే అస్సలు పడదూ.. అంటూనే మందు కొట్టి షూటింగ్ కి వెళ్లిన సంగతులు చెప్పుకొచ్చింది హీరోయిన్ ప్రియాంక జవాల్కర్. 'టాక్సీవాలా' సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక ఇటీవల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది.

ఈ క్రమంలో ఆమె మందు కొట్టి షూటింగ్ లో పాల్గొన్న సంగతులు గుర్తు చేసుకుంది. ''ఈ సినిమాలో ఓ సన్నివేశంలో తాగినట్లు నటించాల్సి వచ్చింది. ఆ సీన్ కోసం ఎంత కష్టపడినా క్యారెక్టర్ పండకపోవడంతో తాగిన పాత్రలో పరకాయ ప్రవేశం కోసం.. తాగే నటించొచ్చు కదా అని వోడ్కా తాగి నటించాను. 

ఆ మత్తులోనే షూటింగ్ లో పాల్గొనేదాన్ని. అయితే మందుకొట్టడం మాత్రం మొదటిసారి. మత్తులో ఉన్నప్పుడు విపరీతంగా నవ్వొచ్చేది. ఆ మత్తుని హ్యాండిల్ చేయడం కష్టమే'' అంటూ చెప్పుకొచ్చింది.

మరి ఆ రేంజ్ లో అమ్మడు నటించిన వోడ్కా సీన్ సినిమాలో ఏ మేరకు పండిందో తెలియాలంటే ఈ నెల 17 వరకు వెయిట్ చేయక తప్పదు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాతో రాహుల్ సాంక్రిత్యన్ అనే దర్శకుడు తెలుగు తెరకు పరిచయమవ్వనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్
Mahesh Babu పిల్లలు కింద పడి మరీ నవ్విన వెంకటేష్ సినిమా? ఆ డైరెక్టర్ కు వెంటనే ఛాన్స్ ఇచ్చిన సూపర్ స్టార్