గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ , కాంతారావు స్మారకం గురించి ఏమన్నాడంటే?

Published : May 30, 2025, 04:19 PM IST
Vijay Devarakonda

సారాంశం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ పై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. కాంతారావు స్మారక అవార్డు తనకు రావడం గురించి  రౌడీ హీరో ఏమన్నాడంటే?

గద్దర్ అవార్డు లపై టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ స్పందించారు. తనకు ప్రకటించిన కాంతారావు స్మారక అవార్డు గురించి మాట్లాడుతూ, ఈ గౌరవం ఎంతో గర్వంగా ఉందని, ఇది నట ప్రపూర్ణ కాంతారావు పేరిట లభించడమూ తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.

విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాంతారావు స్మారక అవార్డు ప్రకటించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ గౌరవం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, జ్యూరీ సభ్యులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే, 2016లో రిలీజ్ అయిన పెళ్లి చూపులు సినిమాను రెండో ఉత్తమ చిత్రంగా ఎంపిక చేసినందుకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పెళ్లి చూపులు చిత్రానికి నా హృదయంలో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ గౌరవం నా ఒక్కడిది కాదు, నా అభిమానులందరికీ చెందిందని భావిస్తున్నాను. వారి ప్రేమ నన్ను నడిపిస్తూనే ఉంది. అని విజయ్ దేవరకొండ అన్నారు. తన నటనా ప్రయాణంలో తోడుగా నిలిచిన కుటుంబానికి, దర్శకులకు, చిత్రబృందానికి విజయ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

నా ప్రయాణంలో తోడుగా ఉన్న కుటుంబం, దర్శకులు, టీమ్ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అని విజయ్ దేవరకొండ అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే గద్దర్ పేరుతో ప్రారంభించిన ఫిల్మ్ అవార్డులను రీసెంట్ గా ప్రకటించింది. 2014 నుంచి 2024 వరకూ సినిమా వాళ్లకు ఇవ్వాల్సిన అవార్డ్స్ అన్నింటిని ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా ప్రసిద్ధ కళాకారులకు ప్రత్యేక పురస్కారాలను ప్రకటించగా, విజయ్ దేవరకొండకు కాంతారావు స్మారక అవార్డు దక్కడం రౌడీ ఫ్యాన్స్ ను ఎంతగానో సంతోషపెట్టింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

OTT Movies: ఈ వారం ఓటీటీ రిలీజ్‌⁠లు ఇవే.. సంచలనం సృష్టించిన చిన్న సినిమా, తప్పక చూడాల్సిన థ్రిల్లర్స్ రెడీ
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే