'టిల్లు స్క్వేర్' ఏ OTTలో .. ఎప్పటి నుంచి?

By Surya PrakashFirst Published Mar 29, 2024, 2:54 PM IST
Highlights

ఈ చిత్రం మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ మూట కట్టుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ గురించి హాట్ టాపిక్ మొదలైంది.

 ‘టీజే టిల్లు’కు వచ్చిన హిట్  ఇంపాక్ట్‌తో ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ చిత్రానికి విడుదలకు ముందే పాజిటివ్ బజ్ ఏర్పడింది. మోస్ట్ అవైటెడ్ సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తుండగా.. ఈ రోజు (మార్చి 29) థియేటర్స్‌లో విడదులైంది టిల్లు స్క్వేర్. సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) చిత్రానికి మల్లిక్  దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ మూట కట్టుకుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి డిటేల్స్ గురించి హాట్ టాపిక్ మొదలైంది.

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటిటి రైట్స్ ని నెట్ ప్లిక్స్ సొంతం చేసుకుంది. డీజే టిల్లు సినిమా ఆహా ఓటీటీలో అందుబాటులో ఉంటే.. టిల్లు స్క్వేర్ హక్కులను మాత్రం నెట్‍ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. భారీగా క్రేజ్ ఉండటంతో ఈ సీక్వెల్‍కు థియేట్రికల్ రిలీజ్‍కు ముందే ఓటీటీ డీల్ చేసుకుంది నెట్‍ఫ్లిక్స్. లెక్క ప్రకారం రిలీజైన నెల రోజుల తర్వాత అంటే ఈ చిత్రం మే తొలివారంలో స్ట్రీమింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది థియేట్రికల్ రన్‍పై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చింది కాబట్టి 45 రోజులు రన్ టైమ్ తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాసం ఉందంటున్నారు.
 
స్టోరీ లైన్ 

రాధిక అనే అమ్మాయితో ప్రేమలో పడి..తర్వాత మర్డర్ కేసులో ఇరుక్కుని ,ఓ స్కెచ్ వేసి బయిటపడ్డ టిల్లు (సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ‌) ఈ సారి కాస్తంత ప్రశాంత జీవితం గడుపుతూంటాడు. తనకు సెట్ అయ్యే విధంగా ఓ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ న‌డుపుతూ తన పనేదో తను చేసుకుంటూటాడు. అయితే అలాగే ఉంటే ఇంక మజా ఏముంది.ఈ సారి టిల్లు (సిద్దు) లైఫ్ లోకి లిల్లీ (అనుపమ) వస్తుంది. ఒక పబ్‌లో అనుకోకుండా పరిచయమై.. మనోడి గుండెను గాభరా పెట్టి గాయబ్ అయ్యపోతుంది. ఆ రాత్రి ఇద్దరూ ఒకటవటంతో ఆమెను మర్చిపోలేక ఆమెను తలుచుకుంటూ వెతుకుతూంటాడు. ఓ  నెల తరువాత ఆమె కనిపించి గర్భవతి అని చెప్పి షాక్ ఇస్తుంది. ఆమెను పెళ్ళి చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు.

 ఆ తర్వాత టిల్లు పుట్టిన రోజుకు మళ్లీ గతంలోలాగే లిల్లి కోసం కూడా అదే అపార్ట్మెంట్స్ కి  వెళతాడు. అక్కడ ఆమె తన అన్న రోహిత్ తప్పిపోయి అప్పటికి ఒక సంవత్సరం అయిందని చెపుతుంది. టిల్లుకు టెన్షన్ స్టార్ట్.  ఎందుకంటే రోహిత్ మరెవరో కాదు.  'డీజీ టిల్లు' లో చనిపోయిన వాడే. అతన్ని తనే  పూడ్చిపెట్టాడు  కాబట్టి.  అప్పుడు టిల్లూ ఏం చేసారు...ఇంతకీ లిల్లీ ఎవరు? రోహిత్ నిజంగానే ఆమెకి అన్నయ్య అవుతాడా? అప్పటి పాత కేసు మళ్ళీ ఎందుకు తిరగతోడారు? పని గట్టుకుని మరీ  టిల్లు జీవితంలోకి ఎందుకు వచ్చింది? అలాగే దుబాయి నుంచి హైదరాబాద్ వస్తున్న షేక్ మహబూబ్ (మురళీ శర్మ) ఎవరు..అతనితో ఈ కథకు ఉన్న లింకేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

click me!