`లైగర్‌` రిజల్ట్ పై విజయ్‌ దేవరకొండ భావోద్వేగ వ్యాఖ్యలు.. త్వరలో గొప్ప సినిమాతో వస్తానంటూ ప్రామిస్‌..

Published : Oct 11, 2022, 05:38 PM IST
`లైగర్‌` రిజల్ట్ పై విజయ్‌ దేవరకొండ భావోద్వేగ వ్యాఖ్యలు.. త్వరలో గొప్ప సినిమాతో వస్తానంటూ ప్రామిస్‌..

సారాంశం

విజయ్‌ దేవరకొండ ఇటీవల `లైగర్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పరాజయంచెందింది. తాజాగా దీనిపై విజయ్‌ దేవరకొండ స్పందించారు.

రౌడీబాయ్‌ విజయ్‌ దేవరకొండ నటించిన సినిమాలు ఇటీవల వరుసగా పరాజయం చెందుతున్నాయి. `గీతగోవిందం` తర్వాత ఆయనకు హిట్‌ దక్కలేదు. `టాక్సీవాలా`, `నోటా`, `డియర్‌ కామ్రేడ్‌`, `వరల్డ్ ఫేమల్‌ లవర్‌` చిత్రాలన్నీ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ఈ క్రమంలో `లైగర్‌` పాన్‌ ఇండియాప్రయోగం చేశాడు విజయ్. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ లో విడుదలై నిరాశ పరిచింది. 

నిజానికి ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విజయ్. సినిమా కోసం తన ప్రాణం పెట్టాడు. పాన్‌ ఇండియా వైడ్‌గా తన మార్కెట్‌ని పెంచుకోవాలనుకున్నారు. అటు `ఇస్మార్ట్ శంకర్‌` సక్సెస్‌తో జోష్‌లో ఉన్న పూరీ జగన్నాథ్‌ సైతం ఈ సినిమాని ఎంతో నమ్మి చేశాడు. కానీ సినిమా పరాజయం చెందింది. అందరి ఆశలను గల్లంతు చేసింది. డిజాస్టర్‌గా నిలిచింది. ఈసినిమాతో అటు పూరీ, ఛార్మిలు సైతం సెలైంట్‌ అయ్యారు. విజయ్‌ తో చేయాల్సిన మరో సినిమా `జనగణమన` సైతం ఆగిపోయింది. 

ఈ నేపథ్యంలో ఇటీవల `లైగర్‌` రిజల్ట్ పై స్పందించారు విజయ్‌ దేవరకొండ. ఇటీవల బెంగుళూరులో జరిగిన `సైమా` వేడుకలో పాల్గొన్న విజయ్‌ `లైగర్‌` ఫెయిల్యూర్ పై భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. తాజాగా విజయ్‌ దేవరకొండ స్పీచ్‌ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో మోస్ట్ ప్రామిసింగ్‌ అవార్డు అందుకున్న విజయ్‌ ఈ సందర్బంగా చెబుతూ, మనందరి జీవితంలో మంచి రోజులుంటాయి, చెడ్డరోజులుంటాయి. ఫెయిల్యూర్స్ మనకి బాధని కలిగించవచ్చు. కానీ వాటన్నింటిని పక్కన పెట్టి పనిచేసుకుంటూ ముందుకు వెళ్లాలి` అని చెప్పాడు.

ఇంకా చెబుతూ, `నేను ఈ అవార్డు వేడుకకి రావాలనుకోలేదు. కానీ ఇక్కడికి వచ్చాను, మీతో మాట్లాడుతున్నాను. అలాగే త్వరలో మంచి సినిమాతో మీ అందరిని సంతోష పరుస్తానని ప్రామిస్‌ చేస్తున్నా. నా నుంచి త్వరలో గొప్ప సినిమా వస్తుంది` అని చెప్పారు విజయ్. ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖుషి` చిత్రంలో నటిస్తున్నారు. సమంత హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమిది. చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమాని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలనుకుంటున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్