Ram Setu Trailer : రామసేతును రక్షించడమే అక్షయ్ కుమార్ లక్ష్యం.. యాక్షన్ లోనూ దుమ్ములేపాడు.!

Published : Oct 11, 2022, 03:36 PM IST
Ram Setu Trailer : రామసేతును రక్షించడమే అక్షయ్ కుమార్ లక్ష్యం.. యాక్షన్ లోనూ దుమ్ములేపాడు.!

సారాంశం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రామ్ సేతు’(Ram Setu). తాజాగా మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇది సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది.  ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.    

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’(Ram Setu). చిత్రానికి అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. గతేడాది మార్చిలో షూటింగ్ ప్రారంభించగా ఈఏడాది విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా కొనసాగుతున్నారు. సినిమాను ఈ నెల 25న దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో చిత్ర యూనిట్ మూవీ ప్రమోషన్స్ ను షురూ చేశారు. బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ‘రామ్ సేతు ట్రైలర్’ (Ram Setu Trailer)ను విడుదల చేయగా ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. 

భారతదేశం - శ్రీలంకలను కలిపే ‘రామ సేతు’ వారధి నేపథ్యంలో భారతీయ సాస్కృతిక, చారిత్రక వారసత్వ మూలాల ఆధారంగా చిత్రం రూపొందింది. ట్రైలర్ ఆధారంగా.. మూవీలో అక్షయ్ కుమార్ పురవాస్తు శాస్త్రవేత్తగా నటిస్తున్నారు. అయితే ప్రభుత్వం రామసేతును కూల్చేయాలని కేవలం మూడు రోజుల గడువు ఇస్తుంది. ఈ మిషన్ లోకి అక్షయ్ కుమార్ ప్రవేశించి రామ్ సేతును కనుగొనే ప్రయత్నం చేస్తాడు. అయితే రామ్ సేతు కూల్చివేతను అడ్డుకునేందుకు పోరాడుతాడు. ఈక్రమంలోనే జాక్వెలిన్, సత్యదేవ్, నాజర్ ల నుంచి సహాయం తీసుకుంటాడు. ఇంతకీ రామ్ సేతును ఎందుకు కూల్చాలనుకున్నారు?  అక్షయ్ కుమార్ ఎలా కాపాడాడు? ఈ క్రమంలో సత్యదేవ్,  జాక్వెలిన్ లు ఏ విధంగా సహకరించారనేది ఆసక్తికరంగా మారింది. మూవీలో యాక్షన్ సీన్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయని, అలాగే రాముడి గొప్పతనాన్ని కూడా చూపించబోతున్నట్టు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది, 
 
చంద్ర ప్రకాష్ ద్వివేది సమర్పణలో వస్తోన్న ఈ సినిమాకు అభిషేక్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, అబున్‌దంతియా ఎంటర్‌టైన్‌మెంట్‌, లైకా ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  సినిమాలో బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ (Jacqueline Fernandez), నుష్రాత్‌ భరుచ్ఛా ప్రధాన హీరోయిన్స్ నటిస్తున్నారు. నాజర్, టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ (Satya Dev) ముఖ్య పాత్రల్లో నటించారు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 25న ‘రామ్ సేతు’ను ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో మాత్రమే రిలీజ్ చేయబోతున్నారు.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?