VD12: విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ క్రేజీ అప్‌డేట్‌.. స్టోరీ, షూటింగ్‌, బ్యానర్ డిటెయిల్స్ ?

By Aithagoni RajuFirst Published Jan 13, 2023, 5:39 PM IST
Highlights

విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రోజు సాయంత్రం ఇవ్వబోతున్నారు.

రౌడీ బాయ్‌ విజయ్‌ దేవరకొండ నెక్ట్స్ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటన రాబోతుంది. ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటిస్తున్న ఆయన నెక్ట్స్ `జెర్సీ` ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన ఈ రోజు సాయంత్రం ఇవ్వబోతున్నారు. `వీడీ12` వర్కింగ్‌ టైటిల్‌తో ప్రకటించబోతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌ నిర్మించనుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. 

తాజాగాఈ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుందనే వివరాలు లీక్‌ అయ్యాయి. ఈ సినిమా రియలిస్టిక్‌గా సాగుతుందట. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా సినిమా ఉండబోతుందని, ఫ్యామిలీ డ్రామ్‌, సెంటిమెంట్లు ప్రధానంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. కాంటెంపరరీ అంశాలను మిళితం చేసి గౌతమ్‌ తిన్ననూరి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. 

అంతేకాదు ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కావడానికి ఇంకా మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం విజయ్‌ చేస్తున్న `ఖుషి` పూర్తయిన తర్వాత గౌతమ్‌ తిన్ననూరి ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించే అవకాశం ఉందని, ఆల్మోస్ట్ మార్చి, ఏప్రిల్‌లో షూట్‌ స్టార్ట్ అవ్వబోతుందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రకటన అధికారికంగా ఇప్పటికే రావాల్సి ఉంది. కానీ డిలే కావడంతో విజయ్‌ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇంకా రావడం లేదంటూ విజయ్‌ని ట్రెండ్‌ చేస్తున్నారు. దీంతో విజయ్‌ దేవరకొండ కొత్త సినిమాకి సంబంధించిన అప్‌డేట్ చక్కర్లు కొడుతుంది. 

ప్రస్తుతం విజయ్‌ .. శివ నిర్వాణ దర్శకత్వంలో `ఖషి` చిత్రంలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో దీన్ని తెరకెక్కిస్తున్నారు. సమంత కథానాయికగా నటిస్తుంది. ఆమె పాత్రకి సంబంధించిన సన్నివేశాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆమె అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. దీని కారణంగానే ఈ సినిమా షూటింగ్‌ డిలే అవుతుందనేది అందరికి తెలిసిన నిజం. ఆమె ఈ నెలఖరులో షూటింగ్‌లో జాయిన్‌ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. 

విజయ్‌ దేవరకొండ పాన్‌ ఇండియా ప్రయత్నం విఫలమైంది. `లైగర్‌`నిరాశ పరిచింది. దీంతో నెక్ట్స్ సినిమాల విషయంలో ఆయన ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు గౌతమ్‌ తిన్ననూరి `జెర్సీ`ని హిందీలో రీమేక్‌ చేయగా, అది ఫ్లాప్‌ అయ్యింది. దీంతోపాటు ఈ కథని మొదట రామ్‌చరణ్‌తో చేయాలనుకున్నారు. ఆయన ఓకే చెప్పి, తర్వాత నో చెప్పడంతో అది విజయ్‌ వద్దకు వచ్చింది. విజయ్‌ టెంప్ట్ అయి ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పేశారు. 
 

click me!