ఉపాసన ముందే నాన్న తిట్టాడు... అవమానంగా ఫీలైంది!

Published : Jan 13, 2023, 05:01 PM ISTUpdated : Jan 13, 2023, 05:05 PM IST
ఉపాసన ముందే నాన్న తిట్టాడు... అవమానంగా ఫీలైంది!

సారాంశం

కొన్ని విషయాల్లో చిరంజీవి కచ్చితంగా ఉంటాడన్న రామ్ చరణ్... ఉపాసన ముందే తిట్టడంతో ఆమె ఫీలై అడిగారని ఆసక్తికర విషయం వెల్లడించారు.   

రామ్ చరణ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ పర్సనాలిటీ. ఆయనను ఇంటర్వ్యూ చేసేందుకు అంతర్జాతీయ మీడియా సంస్థలు ఎగబడుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీ ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకోవడం ప్రపంచ సినిమా దృష్టిని ఆకర్షించింది. ఆర్ ఆర్ ఆర్ డైరెక్టర్ రాజమౌళి హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ గ్లోబల్ ఫేమ్ రాబట్టారు. తాజాగా రామ్ చరణ్ ఓ మీడియా సంస్థ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తండ్రి చిరంజీవి తనను భార్య ఉపాసన ముందు తిట్టడంతో ఆమె అవమానంగా ఫీలైంది, అన్నారు.

నటుడికి శరీరం ఫిట్ గా ఉండటం ఎంత అవసరమో నాన్నకు బాగా తెలుసు. ఈ విషయంలో ఆయన చాలా కచ్చితంగా ఉండేవారు. ఆయన ఏమాత్రం శరీరంలో మార్పు వచ్చినా అంగీకరించేవారు కాదు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నప్పుడు...ఏరా చరణ్ మరీ సన్నబడిబోతున్నావు? అనేవారు. నేను నిజంగానే అంటున్నారనుకుని... అవును నాన్నా సన్నబడ్డాను, అని తల ఊపేవాడిని. సన్నబడటం కాదు లావైపోతున్నావురా ఇడియట్. ముందు జిమ్ కి వెళ్ళు, అని కోప్పడేవారు. 

నాన్న ఉపాసన ముందే తిట్టడంతో ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి అలా తిడుతున్నారని అడిగింది. నటుల మధ్య సంభాషణ ఇలానే ఉంటుంది. నువ్వు సీరియస్ గా తీసుకోకని ఉపాసనకు నేను చెప్పానని రామ్ చరణ్ ఆసక్తికర విషయం బయటపెట్టారు. చిన్నప్పటి నుండి నాకు నటన మీదే ఇంట్రెస్ట్ ఉండేది. నాన్న మాత్రం ముందు చదువు పూర్తి చెయ్, తర్వాత నీ ఆసక్తిని బట్టి కెరీర్ ని ఎంచుకోవచ్చని అనేవారు. 
    
కాలేజ్ కి వెళ్ళేవాడినే కానీ ధ్యాస నటన మీద ఉండేది. మా కాలేజీ డీన్ ఓ రోజు నాన్నకు ఫోన్ చేసి... మీ అబ్బాయికి ఆసక్తి ఉన్న రంగంలోకి పంపండి. చదువు మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు తన టైం, మా టైం వేస్ట్ అని చెప్పారు. అప్పుడు నాన్నగారు.. కాలేజ్ మాన్పించి యాక్టింగ్ స్కూల్ లో చేర్చారు. ఆ విధంగా నటనకు తొలి అడుగు పడిందని చరణ్ చెప్పుకొచ్చారు.   

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి