ఎగ్జామ్స్ వరకు పాకిన విజయ్ దేవరకొండ క్రేజ్!

By Udayavani DhuliFirst Published Nov 23, 2018, 9:49 AM IST
Highlights

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' సినిమా నుండి 'టాక్సీవాలా' వరకు తన ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ప్రేక్షకులకు నచ్చే విధంగా వేస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. 

టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు' సినిమా నుండి 'టాక్సీవాలా' వరకు తన ప్రతి అడుగు ఎంతో జాగ్రత్తగా ప్రేక్షకులకు నచ్చే విధంగా వేస్తూ వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు ఆయన క్రేజ్ ఎంతగా పెరిగిందంటేపోటీ పరీక్షల్లో కూడా ఆయన పేరుని ప్రస్తావిస్తూ ప్రశ్నలు సంధించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది తెలుసుకున్న విజయ్ అభిమానుల ఆనందానికి అవధుల్లేవు.. మా రౌడీ హీరో పేరు పోటీ పరీక్షల్లో అంటూ తెగ మురిసిపోతున్నారు. ఇంటర్నెట్ లో వైరల్ అవుతోన్న ఈ పరీక్ష పేపర్.. ఓ ఇంగ్లీష్ పరీక్షకి సంబంధించినదిగా తెలుస్తోంది. 

Vijay Devarakonda has been________ since his blockbuster movie 'Arjun Reddy'. అని ప్రశ్న ఇచ్చి నాలుగు ఆప్షన్లు ఇచ్చారు. 'అర్జున్ రెడ్డి' సినిమా బ్లాక్ బాస్టర్ విజయం 
తరువాత విజయ్ దేవరకొండ మంచి క్రేజ్ సంపాదించాడు అనే విషయాన్నీ ఇంగ్లీష్ లో ఏ విధంగా చేబుతారనేది ఆ ఖాళీలో పూరించాలి. గతంలో కూడా కొందరు సినీ తారలకు సంబంధించిన ప్రశ్నలు పరీక్ష పేపర్లలో ప్రత్యక్షమయ్యాయి.

మహారాష్ట్రలో ఓ పరీక్షలో 'క్రికెటర్ విరాట్ కోహ్లి గర్ల్ ఫ్రెండ్ ఎవరు' అని ప్రశ్న రాగా అది వివాదానికి దారి తీసింది. విజయ్ దేవరకొండకి సంబంధించిన ప్రశ్న ఇంగ్లీష్ గ్రామర్ కి సంబంధించింది కావడంతో ఎలాంటి వివాదాలు తలెత్తలేదు. 

 

click me!